Online Puja Services

దర్పణ దర్శనం

3.19.217.248
దైవదర్శనం తరువాత...
 
మన పూర్వీకులు గుడికి వెళ్లినప్పుడు దర్శనం అయ్యాక గుడి నుండి బయటకు వచ్చే ముందు కొంతసేపు గుడి మండపంలో కానీ ప్రాకారం లోపల కానీ కొంతసేపు కూర్చుని ఒక చిన్న ప్రార్ధన చేసేవారూ.
 
అది ఏమిటంటే..!
 
"అనాయాసేన మరణం
వినా ధైన్యేన జీవనం
దేహాంతే తవ సాన్నిధ్యం
దేహిమే పరమేశ్వరం."
 
మీరు గుడి లోనికి వెళ్లినప్పుడు దేవుని ముందు నిల్చుని మీ రెండు చేతులను జోడించి, కళ్ళు తెరిచి ప్రశాంతమైన మనసుతో దర్శనం చేసుకోండి. దర్శనం అయ్యి గుడి బయటకు వచ్చాక గుడి మండపంలో కూర్చుని కళ్ళు మూసుకుని అప్పుడు మళ్లీ భగవంతుని రూపాన్ని గుర్తుకు తెచ్చుకుని ఆయనను ఈ క్రింది విధముగా అడగండి.
 
"అనాయాసేన మరణం"
 
నాకు నొప్పి లేక బాధ కానీ లేని
మరణాన్ని ప్రసాదించు.
 
"వినా ధైన్యేన జీవనం" 
 
నాకు ఎవరి మీదా ఆధారపడకుండా, నేను జీవితంలో ఎవరి ముందూ తలవంచకుండా, ఎవరినీ నొప్పించకుండా, నేను ఎవరి వద్దా చులకన కాకుండా ఉండే జీవితాన్ని ప్రసాదించు.
 
"దేహాంతే తవ సాన్నిధ్యం"
 
మృత్యువు నావద్దకు వచ్చినప్పుడు నేను
నిన్ను దర్శించుకునే విధంగా దీవించు.
 
"దేహిమే పరమేశ్వరం"
 
ఓ ప్రభూ నాకు ఈ క్రింది మూడు వరములను ప్రసాదించమని నిన్ను ప్రార్ధిస్తున్నాను.
 
1. అనుక్షణం నీ ప్రార్ధనలొనే గడిపే విధముగా అనుగ్రహించు.నీ ప్రార్ధనతో నన్ను ఉత్తమమైన మార్గంలోకి తీసుకు వెళ్ళు.
2. ఎప్పుడూ కూడా నేను నిన్ను నాకు కానీ నా బిడ్డలకు కానీ సంపదలు కానీ పేరు ప్రఖ్యాతులు కానీ ఇవ్వమని అడగను కానీ నాకు నీవు ఉత్తమమైన నీ సాన్నిధ్యాన్ని అనుగ్రహించు.
3. నాకు ఎప్పుడూ కూడా నీవు సదా అండగా ఉండి నన్ను ఉత్తమమైన మార్గంలో నడిపించు.
 
ఇలా మీరు ఎప్పుడు గుడికి వెళ్లినా ఇప్పుడు చెప్పిన విషయాలు గుర్తుంచుకొని ప్రవర్తిస్తే మనకు ఏమి కావాలో అవి అన్ని కూడా మనం అడగకుండానే ఆయనే ప్రసాధిస్తాడని మరువకండి.
 
దీనినే దర్పణ దర్శనం అంటారు, మనస్సనే దర్పణం లో దర్శించి, ఆ దివ్యమంగళ స్వరూపాన్ని హృదయం లో  ప్రతిష్టించుకునే ప్రయత్నమే ఈ ప్రక్రియ.
 
- బొర్రా రమణా రెడ్డి 

Quote of the day

Every child comes with the message that God is not yet discouraged of man.…

__________Rabindranath Tagore