Online Puja Services

నాస్తికులు సైతం వొప్పుకొనే నిజాలు

3.135.214.175
నేను హిందూవు గా గర్విస్తున్నా...
 
ఎందుకంటే దేవుడు లేడు.. అని వాదించే నాస్థికులు సైతం ... 
మోకాలు మీద నిలబడి ఒప్పుకునే నిజాలు..
      
*దేవుని పేరుతో హిందూవులు చేసే అన్నదానాలు పేదవాడి కడుపు నింపుతున్నందుకు.*
 
*దేవుని పేరుతో ఆలయాలలో కొన్ని లక్షల మందికి జీవనోపాది దొరుకుతున్నందుకు.*
 
*దేవుని పేరుతో ఆడవాల్లను అమ్మవారి గా భావిస్తున్నందుకు.*
 
*దేవుని పేరుతో మూగజీవాలను సైతం దైవంగా భావిస్తున్నందుకు.* 
 
*దేవుని పేరు తో ప్రకృతిని పూజిస్తూ ప్రకృతిని కాపాడుతున్నందుకు.*
 
*నిజంగా మనిషిగా, హిందూ గా గర్విస్తున్నా...*
 
*మట్టి ఎంత గొప్పదైనా కావచ్చు...* *దానిని దేవుడిగా మలిచి, ఆరాధించడం ఎంత వరకు సమంజసం???* .....  అని హిందూ హేతువాదులు మరియూ ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో  అడిగిన ప్రశ్నకు....
 
పూజ్యశ్రీ స్వామి పరిపూర్ణానంద చెప్పిన సమాధానం చదవండి..
 
 అందమైన, అర్థవంతమైన ఈ సృష్టి వెనుక ఏదో కారణం ఉండి తీరాలి... 
 ఆ తత్త్వాన్నే భగవంతుడు అని శాస్త్రాలు వివరించాయి...
భగవంతుడి కంటూ ప్రత్యేకమైన రూపం లేదు. కాని, ఏ రూపంతోనైనా ఆరాధించవచ్చు..
 
*ఉదాహరణకు:-..*  మూడు రంగుల జెండాను మన దేశానికి గుర్తుగా భావించి గౌరవిస్తాం., నమస్కరిస్తాం కూడా... అయితే నిజానికి ఆ గుడ్డముక్కలో మనదేశం ఉందా అని ఎప్పుడైనా ప్రశ్నించుకున్నామా??? 
 
లేదంటే, దేశానికి ఈ మూడు రంగుల గుడ్డకూ సంబంధమేంటని ఎప్పుడైనా అపహాస్యం చేశామా..???
 
సువిశాలమైన ఇంతటి దేశం వాస్తవానికి ఆ చిన్న వస్త్రంలో ఉండదు.. ఉండలేదు కూడా... కానీ, మనం దేశభక్తితో ఈ మూడు రంగుల పతాకాన్ని దేశంగా భావించి గౌరవించి నమస్కరించటం మన బాధ్యతకు నిదర్శనం.. 
 
అలాగే... అనంతమైన పరమాత్మ తత్వం పట్ల కృతజ్ఞతా భావనతో, ప్రతిమలో దైవాన్ని దర్శించి ఆరాధన చేయడం ఏ మాత్రం దోషం కాదు. ఇది దైవభక్తికి నిదర్శనం.. సమస్తాన్ని మనకు సమర్పించి నిరంతరం కాపాడే నేల తల్లిని సాక్షాత్తూ భగవంతుడిగా భావించడంలో తప్పేముంది.. సకల ప్రాణికోటి జన్మించాలన్నా, *ఈ భూమిపై జీవించాలన్నా అందుకు కారణం మట్టి. చివరకు సమస్తమూ ఈ మట్టి లోనే విలీనమవుతాయి...
 
  *అందుకే మట్టికి, మనిషికే కాదు... ప్రాణులన్నింటి మనుగడకు కారణమైన ఈ నేల తల్లిని భగవంతుడిగా భావించి ఆరాధించడం మన ప్రాచీనులు మనకు అందించిన సంస్కృతి..* అని చెప్పే సరికి తెల్ల మొహం వేసుకున్నారు హిందూ హేతువాదులు.... 
 
- పాత మహేష్

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore