ఫ్రెండ్స్ మనకు అసలు సమస్యలు లేవు
వాటి వలన వచ్చే దుఃఖము బాధలు అసలు లేవు మనలో ఉన్నదంతా ఆనందమే. కానీ మనమే కొందరు అహంకారంతో మరి కొందరు అజ్ఞానంతో సమస్యలను కొని తెచ్చుకుని ఆనందానికి దూరం అవుతున్నాం దుఃఖానికి చేరువవుతున్నం
అహంకారం అజ్ఞానము మనిషిని అనునిత్యం వెంటాడే శత్రువులు.
మనలో ఉన్న అజ్ఞానంతో కూడ అందరిలో
అహకారం చూస్తాం ఎలా అంటే.
ఉదాహరణ నా గురించి చెబుతాను.
ఇంచుమించు ఇప్పటివరకు నా సలహాలు స్వీకరించని వారిని,నా ప్రశంసలకు స్పందించని వారిని,నా మాటకు మర్యాదకు విలువ ఇవ్వని వారిని,అందరినీ వారికి అహంకారమేమో అనుకున్నా
కానీ ఈ మధ్య తెలుసుకున్న విషయం ఏంటంటే నాదే మూర్ఖత్వపు ప్రేమ అని తెలుసుకున్న. తెలుసుకున్న దగ్గరనుంచి అందరిలోనూ మంచిని వెతుక్కుంటూ నేనే తగ్గి ఉంటున్న ఎందుకంటే బంధాలకు విలువిచ్చే అలవాటు నాకుంది.
మీకో విషయం చెప్పనా
మనం ఒప్పుకోగలిగితే కొందరికి అహంకారం కూడా ఆభరణమే. వారికీ ఆ ఆభరణం అందంగా ఉటుంది
ఎందుకంటే వారికీ అహంకారం అనే ఆభరణం
ధరించే అర్హత ఉంది కాబట్టి.
కొందరిలో అహంకారం మూర్ఖత్వం తో కలిసి ఉంటుంది ఆ అహంకారానికి ఏ పేరు పెట్టాలో ,
దెయ్యం అనాలో రాక్షసుడు అనాలో లేదా ఇంకా ఏదన్నా కొత్త పదం ఉపయోగించాలో....
అజ్ఞాతంగా మూర్ఖత్వంతో కలిసి
వారిలో ఉంటాడు. అన్ని అనర్థాలకూ మూలకారణమవుతాడు.
ఆత్మీయుడిగా నమ్మిస్తాడు.
కానీ ఆగర్భశత్రువై నిండా ముంచేస్తాడు. అందలమిక్కిస్తానని ఆశలు కల్పిస్తాడు.
కానీ మన అభివృద్ధికి అతనే ఆటంకమవుతాడు.
మనలో ఏ విశేషమూ లేకపోయినా,
ఎంతో విఖ్యాతులమని విర్రవీగేలా చేస్తాడు.
మనలోని వాపును కూడా మహాబలమని భ్రమింపచేస్తాడు.
అణుకువతో ఓ మెట్టు దిగుదామని అంతరంగం చెబుతున్నా, మూర్ఖత్వం అహంకారమై
అది అవమానమంటూ అడ్డుపడతాడు.
ఆ అంతర్యామికీ, మన అంతరాత్మకూ మధ్య
అతనే అడ్డుగోడవుతాడు.
ఆ అదృశ్య, అతి ప్రమాదకర అంతఃశత్రువు మరెవరో కాదు *అహంకారం*.
వినమ్రతకు అది అనాదిగా బద్ధ వ్యతిరేకం.
అహంకారికి ఆ భగవంతుడు ఆమడ దూరంలో ఉంటాడు.
ముందు *నేను* అనే మాయ నుంచి నువ్వు బయటపడితే నిన్ను నా దరికి చేర్చుకుంటానంటాడు. అందుకే ఆధ్యాత్మిక సాధనల లక్ష్యం కూడా ఆత్మను పొందడం కాదు.
అహంకారాన్ని పోగొట్టుకోవడం.
అయినా *నేను* *నాది* అని గర్వించేటంత ప్రత్యేకత మనలో ఏముంది గనక?
సామ్రాజ్యాలను ఏలిన సార్వభౌములే శ్మశానాల్లో సమాధులై పోయారు.
మరి మనమెంత?.
కారం ఎక్కువైతే శరీరంలోని రక్తాన్ని పీల్చేస్తుంది.
కాని అహంకారం ఎక్కువైతే మానవత్వాన్నే పీల్చేస్తుంది. అహంకారం ఎవరిలో ప్రవేశిస్తుందో వాడి గతి అధోగతే. చెదపురుగు పట్టిన వస్తువు ఏ విధంగా పనికిరాకుండా పోతుందో, *అహంకారం* అనే చెదపురుగు పడితే, మానవవత్వం నశించిపోతుంది.
వెర్రి ఆలోచనలు కలిగిస్తుంది. మనల్ని పతనం వైపు తీసుకెళుతుంది మానవత్వం నుండి రాక్షసత్వంలోకి నెట్టేస్తుంది.
శ్మశానంలో రాజు మట్టి, సేవకుని మట్టి అని విడివిడిగా ఉండవు కదా అంతా ఒకటే మట్టి.
అందుకే ఈ భూమి మీద ఉన్న మూన్నాళ్ళూ
మంచి లక్షణాలతో, అహంకారం పక్కన పెట్టగలిగితే జీవితం ప్రశాంతంగా హాయిగా కొనసాగుతుంది
అహంకారం ఆత్మీయుల దూరం చేస్తుంది భగవంతుణ్ణి మరిపింప చేస్తుంది.
కాబట్టి ఫ్రెండ్స్ అందరూ మన వాళ్లు అందరూ
ఆ పరమాత్మ బిడ్డలమే మనలోని ఉన్న ఈ శత్రువుని జేయించేందుకు ప్రయత్నిద్దాం. ప్రయత్నించటం ఏంటి ప్రాలదోళదాం.ఆ తండ్రి పరమాత్మని
మన హృదయంలోకి ఆహ్వానిద్దాం.
ఆ తండ్రి పాదాల చెంత చేరువరకు ఆనందంగా ఉందాం
శివయ్య అందరిని చల్లగా చూడు తండ్రి
- బి. సునీత