పచ్చ కామెర్ల రోగికి లోకమంతా పచ్చగానే ఉంటుంది అంటే....
ఒకరోజు శ్రీ కృష్ణుడు ధర్మరాజును పిలిచి.... ఈ ద్వారకా నగరంలో చెడ్డవాళ్ళు ఎంతమంది వున్నారో తెలుసుకొని రమ్మంటాడు....
ధర్మరాజు ద్వారకా నగరమంతా తిరిగి ఒకరోజు కృష్ణుని దగ్గరకు వచ్చి... ఈ ద్వారకా నగరంలో నాకు అందరు మంచివాళ్ళలాగే కనిపిస్తున్నారు ఎవ్వరూ.... చెడ్డవాళ్ళలాగా కనిపించట్లేదు. ఒకవేళ చెడ్డవాడు ఎవరైనా ఉంటే అది నేనేనేమో.... చెడు ఏదైనా ఉంటే అది నాలోనే ఉందేమో అంటాడు. అది ధర్మరాజు ఉత్తమ గుణానికి నిదర్శనం.
తరువాతి రోజు కృష్ణుడు దుర్యోధనున్ని పిలిచి ఈ నగరంలో మంచివాళ్ళు ఎంతమంది వున్నారో తెలుసుకొని రమ్మంటాడు.
దుర్యోధనుడు రాజ్యమంతా తిరిగి ఒకరోజు కృష్ణుని దగ్గరకు వచ్చి... ఈ నగరంలో నాకు అందరు చెడ్డవాళ్ళలాగే కనిపిస్తున్నారు. ఎవ్వరూ మంచివాళ్ళలాగా కనిపించట్లేదు. ఒకవేళ మంచివాడు ఎవరైనా ఉంటే అది నేనేనేమో... మంచి ఏదైనా ఉంటే అది నాలోనే ఉందేమో అంటాడు.
అది దుర్యోధనుని అల్ప బుద్ధికి నిదర్శనంగా నిలిచిపోయింది.
ఇద్దరి ఆంతర్యం తెలుసుకున్న కృష్ణుడు మనసులోనే ధర్మరాజును ఆశీర్వదించాడు....
అందుకే అంటారు ధర్మరాజు పోతుంటే అంత మంచే కనిపించింది. దుర్యోధనుడు పోతుంటే అంత చెడే కనిపించింది అని... చూసే చూపును బట్టి ఉంటుంది. చూడబడేది
- బి. సునీత