అన్నవరం ఒక సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం.
పిలిస్తే పలికే దైవంగా పేరుపొందిన శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయాన్ని రత్నగిరి అనే కొండపై అన్నవరంలో నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణం అయి ఒక శతాబ్దము పైగా మాత్రమే ఐనా చాలా ప్రాశ్యస్త్యాన్ని, ప్రాముఖ్యతను పొందింది. సమీపంలో పంపా నది హోయలొలుకుతూ పారుతుంటుంది. కొండపై నెలకొని ఉన్న ఈ దేవాలయంలో వేంచేసి ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామిని దర్శించేందుకు గుడివరకు ఘాట్ రోడ్డు నిర్మించారు. మెట్లు గుండా కూడా వెళ్ళవచ్చు. ఇక్కడ సామూహికంగా వందలాది దంపతులు కూర్చుని ఒకేసారి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కనుల పండువగా చేసికొంటూ ఉండటం ఒక ప్రత్యేకత; చూచి తీరవలసిన సుందర దృశ్యం.
వివాహాది శుభ కార్యములు మరియు విద్యా ఉద్యోగ, వ్యాపార అభివృద్ధి కొరకు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము చెయ్యడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం.. యితిహాసం ప్రకారం అడిగిన వరాలను తీర్చే దేవుడు కాబట్టి అన్నవరం దేవుడు అంటారు.
శ్రీ వీర వెంకట సత్యనారాయణస్వామి ఆలయం లేదా అన్నవరం ఆలయం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాలోని అన్నవరం పట్టణంలో ఉన్న హిందూ-వైష్ణవ ఆలయం. ఈ ఆలయం రత్నగిరి అనే కొండపై ఉంది మరియు విష్ణువు అవతారమైన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి.