Online Puja Services

తల్పగిరి రంగనాధస్వామి ఆలయం

3.129.63.252
తల్పగిరి రంగనాధస్వామి ఆలయం నెల్లూరు జిల్లాలోని ఆలయాలలోకెల్లా అత్యంత ప్రాచీనమైన ఆలయం. ఇది నెల్లూరులోని రంగనాయకులపేటలో పెన్నానది ఒడ్డున ఉంది .రంగనాధస్వామిని విష్ణువు ప్రతి రూపంగాను, రంగనాయిక అమ్మవారిని లక్ష్మీదేవి ప్రతి రూపంగాను అభివర్ణిస్తారు.

స్థలపురాణం:

మహాపుణ్యక్షేత్రాల పర్యటనలో భాగంగా ఇక్కడికి వచ్చిన కశ్యప ముని ఇక్కడ పౌండరీక యాగం నిర్వహించాడు. అతని భక్తికి మెచ్చిన నారాయణుడు ఆ ప్రాంతం భక్తుల ఆదరణతో పరిఢవిల్లుతుందని అక్కడ శ్రీ రంగనాథస్వామిగా వెలశాడు. మరో కథనం ప్రకారం కశ్యప మహర్షి యజ్ఞంలోనుంచి ఉద్భవించిన త్రేతాగ్ని జ్వాలల్లో ఒకటి శ్రీరంగనాథ స్వామి ఆలయంగా, మరొకటి జొన్నవాడ కామాక్షమ్మ ఆలయంగా, మరోటి వేదగిరి నరసింహస్వామి క్షేత్రంగా వెలసినట్లు స్కంద పురాణం, వైష్ణవ సంహితలో ప్రస్తావన ఉంది.

ఆలయం దర్శనం ఉదయం 6:30 నుంచి 12 గంటలు తిరిగి సాయంత్రం 4:30 నుంచి రాత్రి 8 గంటలు వరకు దొరుకుతుంది...

మీకు తెలిసిన సమాచారం కామెంట్ లో తెలుపగలరు..

- శ్రీనివాస గుప్తా వనమా

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore