మన పండుగల గొప్పతనం
*ఉగాది:*- కష్టము,సుఖము,సంతోషము, బాధ ఇలా అన్నింటిని స్వీకరించాలని.
*శ్రీరామ నవమి*:- భార్య - భర్తల అనుబందాన్ని గొప్పగా చెప్పుకోవడానికి.
*శ్రీరామ నవమి*:- భార్య - భర్తల అనుబందాన్ని గొప్పగా చెప్పుకోవడానికి.
*అక్షయ తృతీయ*:- విలువైన వాటిని కూడబెట్టుకోమని.
*వ్యాస (గురు)పౌర్ణమి* :- జ్ఞానాన్ని అందించిన గురువును మరువొద్దు అని.
*వరలక్ష్మి వ్రతం* :- నీకున్న ఐశ్వర్యమును అందరికి పంచుతూ, అందరితో కలిసి సంతోషంగా ఉండమని.
*రాఖీ పౌర్ణమి*:- తోడబుట్టిన బంధం ఎప్పటికి విడరాదు అని.
*వినాయక చవితి* ( నవరాత్రులు ) :- ఊరంతా ఒక్కటిగా కలవడానికి.
*పితృ అమావాస్య* :- చనిపోయిన వారిని ఎప్పటికి మరువకు అని చెపుతూ.
*బతుకమ్మ*:- ఊళ్లోని వాళ్లంతా ఆట పాటలతో కలిసిపోతూ సంతోషంగా గడపమని.
*దసరా ( ఆయుధ పూజ)* :- ఎప్పుడు నీకు అండగా నిలిచి నీ పనులు చేసే దానిని గౌరవించమని తెలిపేది.
*దీపావళి* :- పది మందికి వెలుగు చూపే జీవనం నీదవాలని.
*నాగుల చవితి*;- ప్రాణాల్ని తీసేదయిన సరే తోటి జీవులను ప్రేమగా అధరించమని.
*కార్తీక పౌర్ణమి* :- చలికాలం చన్నీటి స్నానం చేసి ఇంద్రియములను గెలువమనెడి.
*సంక్రాంతి*:- మనం జీవించే ఉన్నాము అంటే కారణం వ్యవసాయం అలాంటి దానిని మరువకుండా సంబరాలు జరుపమని.
*మహా శివరాత్రి* :- కాలం మారుతోంది నీ శరీరాన్ని నీ అదుపులో ఉంచుకో అని.
*కామదహనం*:- కోరికలు తగ్గించమని.
*హోళీ* :- వివిధ రంగుల వలెనున్న వివిధ మనుషులు ,వివిధ అనుభూతులను పిల్లా పెద్ధ అందరూ కలిసి సంతోషంగా ఆస్వాదించమని మన పండుగల అంతరార్దం
- సూర్యప్రకాష్ సాధనాల