Online Puja Services

శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం

18.191.111.133
ఆ అమ్మవారి దీవెనలు మీ కుటుంబం లో ఉన్నవారు అందరికి ఉండాలని నేను మనస్సుపూర్తిగా కోరుకుంటున్నాను...

విశాఖపట్నంలోని బురుజుపేట పరిధిలోకల ప్రసిద్ద దేవాలయం.ఇక్కడి అమ్మవారు శ్రీకనకమహాలక్ష్మి విశాఖప్రజల గ్రామదేవతగా వెలుగొందుతున్నది.

సముద్ర మథనంలో ఆవిర్భవించిన శ్రీమహాలక్ష్మి సకల సౌభాగ్యదాయిని. లౌకిక జీవనంతో పాటు పారమార్థిక జీవనంలోనూ మానవ మనుగడకు సంబంధించి లక్ష్మీదేవిదే ప్రముఖపాత్ర. ఆదిలక్ష్మి మొదలు వీర, విజయ, సంతాన, ధాన్య, ఐశ్వర్య, ధన, రాజ్యలక్ష్మి- ఇలా ఎనిమిది రూపాల్లో ‘అష్ట లక్ష్మి’గా మహాలక్ష్మి పూజలందుకుంటోంది.

చరిత్ర

ఈ దేవాలయానికి సంభందించి సరియైన చారిత్రక ఆధారాలులేవు. ఒకప్పటి విశాఖను పాలించిన రాజుల కులదేవత, కుటుంబ దేవతగా తెలుస్తుంది. అప్పటి రాజుల యొక్క కోట బురుజు కలప్రాంతం అయిన బురుజుపేటలో కల అమ్మవారు. ఒకనాటి వైశాఖీశ్వరిని భక్తజనులు ఇప్పుడు ‘కనక మహాలక్ష్మి’గా కొలుచుకుంటున్నారు. ఆమె శాంత స్వరూపిణి. పలువురు పీఠాధిపతులు, దైవజ్ఞులు, పండితులు అమ్మవారిని దర్శించుకున్నారు.

స్థానిక కధనం ప్రకారం, 1912 లో శ్రీ కనక మహాలక్ష్మీ అమ్మవారి యొక్క విగ్రహం బావి నుండి తీయబడింది. అది రహదారి మధ్య ప్రతిష్టించబడి ఉండేది. 1918లో అప్పటి జిల్లా కలెక్టర్‌ వెర్నస్‌- మార్గానికి అడ్డంగా ఉందన్న ఉద్దేశంతో దేవి విగ్రహాన్ని ఒక మూలగా పడవేయించాడట. ఆ తరవాత పలు కారణాల వల్ల విశాఖపట్నంలో భయంకరమైన ప్లేగు వ్యాధి వ్యాపించి, అనేకమంది మృత్యువాత పడ్డారని స్థానిక చరిత్ర చెబుతోంది. ప్రజల భక్తి విశ్వాసాలు గుర్తించిన అధికారులు, అమ్మవారికి గద్దె కట్టించి యథాస్థానంలో ప్రతిష్ఠించారు.

అప్పటికి వ్యాధి తగ్గుముఖం పట్టడంతో ప్రజలకు అమ్మవారి మీద గురి ఏర్పడటం తరువాత ఆమె యొక్క మహిమలు కథలుగా విస్తరించడం ద్వారా విశేష ప్రాచుర్యం పొందినది.అప్పటి నుంచి విశాఖ పరిసర ప్రాంతాల్లో ఆమె ఆరాధ్య దేవత అయింది.

విశేషాలు

ఆలయం మండపం ఉంటుంది కాని గర్భగుడి అంటూ ప్రత్యేకంగా ఉండదు.ఇనపచట్రం కొంతవరకూ రక్షణగా ఉంటుంది ఎవరైనా గర్భాలయానికి నేరుగా వెళ్ళీ అమ్మవారిని తాకి దర్శించుకోవచ్చు. అమ్మవారి గర్భాలయానికి తలుపులు కానికప్పు కాని ఉండవు.

- శ్రీనివాస గుప్తా వనమా

Quote of the day

The life ahead can only be glorious if you learn to live in total harmony with the Lord.…

__________Sai Baba