విష్ణుదత్తుని కథ
ఫ్రెండ్స్ మన కోసం అంటే తమ బిడ్డల కోసం ఆ తండ్రి పరమాత్ముడు ఈ భూమి మీదకు వచ్చి ఎంతో కష్టపడ్డాడు ఎన్నో కర్మలు చేశాడు.కర్మలు అనగా మనం చేసే పనులు ద్వారా ఆలోచనలు ద్వారా వచ్చేవి.శివయ్య కృష్ణుడు రాముడు ఇంకా ఎందఱో ఎందరెందరో. వాళ్లు ఈ మూడు లోకాలలో ఏ విధమైన కర్మలు చేయనవసరం లేనప్పటికీ ఈ లోకం కోసం మన కోసం వాళ్లను చూసి మనం నేర్చుకోవాలని ఎనో కర్మలు చేశారు. జ్ఞాని వారు చేసిన పనులలో మంచి గ్రహించి మంచి పనులతో మంచి కర్మలను చేస్తూ చెడు కర్మలకు అతీతుడై తన జన్మ సార్ధకం చేసుకుంటాడు.
అజ్ఞాని వాళ్ళు చేసినా పనుల్లో వాడికి నచ్చినట్టు ఏదేదో గ్రహించి చేడు కర్మలు చేస్తూ చేడు మార్గంలో పయనిస్తూ జన్మ నాశనం చేసుకుంటాడు వాడు నాశనమైనది కాక సమాజాన్ని కూడా బ్రష్టు పట్టిస్తడు.
అజ్ఞాని వాళ్ళు చేసినా పనుల్లో వాడికి నచ్చినట్టు ఏదేదో గ్రహించి చేడు కర్మలు చేస్తూ చేడు మార్గంలో పయనిస్తూ జన్మ నాశనం చేసుకుంటాడు వాడు నాశనమైనది కాక సమాజాన్ని కూడా బ్రష్టు పట్టిస్తడు.
మరల పైపెచ్చు చోద్యంగా అన్ని కర్మలు ప్రకృతి ద్వారా జరుగుతుండగా అజ్ఞాని తానే చేస్తున్నట్టు వాళ్లు నడిచిన దారిలో నడుస్తున్నట్టు భ్రమలో జీవిస్తాడు ఫలితం కొరకు కర్మలు చేస్తాడు.
కానీ జ్ఞాని మాత్రం ఏ ఫలితం ఆశించకుండా తాను చేసే కర్మలన్నీ ప్రకృతి ద్వారానే జరుగుతున్నాయని గ్రహించి లోక క్షేమం కోసం కర్మలు చేస్తాడు.అసలు విషయం గ్రహించి తెలిసి అహంకార రహితంగా ఉంటాడు.
మనం చేసే ప్రతి కర్మ అంటే మనం చేసే పూజ అయిన మంచి పనైనా ఏమీ ఆశించకుండా మన సౌలభ్యం కోసం కాకుండా ఇతరుల కొరకు మంచి చేస్తే భగవంతుడు ఎప్పుడూ మనతోనే ఉంటాడు ఆయన పాదాల చెంత చేరే వరకు చేయి పట్టి నడిపిస్తాడు
మోక్షం ప్రసాదిస్తాడు.ఎలా అంటే చిన్న కధ చెబుతాను చదవండి పూర్వము విష్ణుదత్తుడు అనే బ్రాహ్మణోత్తముడు వుండేవాడు. ఆయన తన ధర్మమును అనుసరిస్తు, పంచయజ్ఞములను కూడా చేసేవాడు. సంతానము లేదు అయినా భగవంతుని ఏమీ కోరక కర్మలను ఆచరిస్తూ వుండేవాడు. అతడు భూత యజ్ఞం అంటే కొంత అన్నాన్ని ముద్ద చేసి బయట పెట్టేవాడు. ఆ పవిత్ర అన్నాన్ని, రోజు వారి ఇంటి దగ్గర వున్న ఒక చెట్టూ మీద వున్న్న రాక్షసుడు తినేవాడు. దాని వలన ఆ రాక్షసుని లో మంచి గుణములు అభివృద్ది అయినాయి. ఎలాగైనా విష్ణుదత్తునికి సహాయం చేయాలనిపించి ఒక రోజు విష్ణుదత్తునికి ప్రత్యక్షమయి నీ బలి అన్నము వలన నాకు ఎంతో మేలు జరిగినది. నేను నీకు సహాయం చేయాలనుకున్నాను. వరం కోరుకో అన్నాడు. అయ్యా నా కర్మ నేను చేసాను. వాటి ఫలితం మీద నాకు ఆశ లేదు, కోరిక లేదు , నాకు ఏమీ వద్దు అన్నాడు. రాక్షసుడు చాలా బలవంతము చేసాడు. చివరకు విష్ణుదత్తుడు, దత్తస్వామిని చూపించమన్నాడు. రాక్షసుడు మాకు ఆయన అంటే హడల్ అయినా నీవు అడిగావు కాబట్టి దూరం నుండి చూపిస్తాను అని అన్నాడు.

ఒక రోజు పరిగెత్తుకుంటూ వచ్చి విష్ణుదత్తుని తొందర చేసాడు. దత్తాత్రేయుని చూడటానికి అని దారిలో చెప్పాడు. స్వామి చాలా పరిక్షలు పెడతాడు నీవు తట్టుకోవాలి అని చెప్పాడు. దానికి విష్ణుదత్తుడు సరే అన్నాడు. దూరంలో వున్న కల్లు కొట్టుని చూపించి అక్కడ కల్లు త్రాగే ఒక వ్యక్తిని చూపించి అయనే దత్తాత్రేయుడు అని అన్నాడు. విష్ణుదత్తుడుకి దగ్గరకు వెళ్ళడానికి చాలా ఇబ్బంది కలిగింది , ఇతడు స్వామి నా అని అనుమానం కలిగింది. అంతలో స్వామి మాయం అయినాడు. రాక్షసుడు దగ్గరకు వచ్చి విష్ణుదత్తునితో మంచి అవకాశం పోగొట్టుకున్నావు. ఆయనే దత్తాత్రేయుడు నేను ముందే చెప్పాను కదా స్వామి చాలా పరిక్షలు పెడతాడని, మల్లీ మరొకసారి చూపించాడు. మాంసము తింటూ కనిపించాడు. అపుడు అవకాశము పోగొట్టుకున్నాడు. అపుడు రాక్షసుడు చెప్పాడు ఇంకొక్క సారి మాత్రం చూపిస్తాను ఆపై నీ కర్మ అన్నాడు. విష్ణుదత్తుడు రాత్రి గట్టి నిర్ణయం తీసుకున్నాడు. ఈ సారి రాక్షసుడు విష్ణుదత్తుని స్మశానమునకు పిలుచుకుని వెళ్ళాడు. అక్కడ స్వామిని చూచి భయపడినా వెళ్ళి కాల్లు గట్టిగా పట్టుకున్నాడు, స్వామి తన్నినా వదల లేదు. చివరకు కొద్ది సేపు పరీక్షించి దర్శనమిచ్చాడు. కోరిక కోరమన్నాడు. కోరికలు లేవు స్వామి , రేపు మా నాన్నగారి (అబ్దికము) తద్దినము మీరు భోజనమునకు రండి అని పిలిచాడు, స్వామి వస్తానన్నాడు. రాత్రి భార్యాభర్తలకు నిద్ర రాలేదు. స్వామి వస్తే ఎలా చేయాలి, భోజనము ఏమి చేయాలి ఇవే ఆలోచనలతో తెల్లవారినది. పూజ ముగించుకుని స్వామి కోసం ఎదురు చూడ సాగారు. చిన్న శబ్దము అయినా స్వామి వచ్చారేమో అని చూచేవారు. స్వామి వచ్చాడు, భోజనమునకు స్నానము చేసి రమ్మని అడిగాడు. జతలో భోజనమునకు ఎవరిని పిలిచారు అని అడుగగా లోపలికి వెళ్ళి భార్యని అడిగాడు. ఆమె సూర్యదేవుని రమ్మని ఆహ్వానించగా స్వామి వెంటనే వచ్చాడు. అతనిని చూచిన దత్తాత్రేయ స్వామి సంతోషించి భోజనం తరువాత వారి భక్తికి మెచ్చి దత్తాత్రేయుడు వారికి మోక్షమును ఇచ్చాడు.
చూసేరా ఫ్రెండ్స్ కోరిక లేకుండా కర్మ చేస్తే ఫలితం ఇంత మంచిగా వుంటుంది. శివయ్య అందరిని చల్లగా చూడు తండ్రి
- బి సునీత
చూసేరా ఫ్రెండ్స్ కోరిక లేకుండా కర్మ చేస్తే ఫలితం ఇంత మంచిగా వుంటుంది. శివయ్య అందరిని చల్లగా చూడు తండ్రి
- బి సునీత