Online Puja Services

మనం పుణ్యకార్యాలు ఎందుకు చేయాలి.....

18.118.184.232

ఒక వ్యక్తి జీవించి ఉన్నంత వరకు బంధాలు బాధలు ఉంటాయి... ఎలా అంటే ఒక దీపం వెలిగేటప్పుడు దానికి చమురు (నెయ్యి లేదా నూనె) కావాలి, ఎక్కువ గాలి ఉండకూడదు, అలా అని అస్సలు గాలి లేకుండా కూడా ఉండకూడదు.. ప్రతిదీ దానికి ప్రాణ సంకటమే ... అదే ఇక సారి దీపం ఆరిపోతే ఇక దానికి గాలితో కానీ చమురుతో కానీ దేనితో పని లేదు.. అక్కడితో దాని కధ ముగిసింది అని అర్థం .... అలాగే ఒక వ్యకి జీవించి ఉన్నంత వరకు ప్రతిదీ కావాలి , ప్రతీది అవసరమే .... ఒక సారి జీవం పోగానే ఈ ప్రాపంచిక విషయాలు బంధాలు అవసరం లేదు, వారు చేసిన పుణ్యం తప్ప ఏది కూడా ఉండదు,ఎవరు వెంట కూడా వెళ్ళలేరు, అక్కడితో ఆ వ్యక్తి కధ ముగిసినట్టే....

దీనిని పట్టి మనకు అర్థం➖  ఏమవుతుందంటే ... .... ఈ రోజు మనం పెంచుకున్న బంధాలు, ప్రేమలు, కోపాలు ,తాపాలు, అన్ని అశాశ్వతమైనవే, కేవలం  మనము చేసిన సేవనే మన వెంట వస్తుంది అని అర్థమవుతుంది, కాబట్టి నిత్యం మనం , పుణ్యకార్యాలు చేయాలి అని పురాణ వచనం |

మనలో ఆధ్యాత్మిక ఎదుగుదలకు శాంతే కొలమానం !! అవగాహనే మనసుకు మంచి మందు. అవగాహన అంటే మనసుకు విషయం సంపూర్ణంగా, సమగ్రంగా, సమూలంగా అర్ధంకావడం. మనకు బాల్యం నుండి మనసును పోల్చుకోవడం, పోటీపడటం అలవాటుగా మారింది. అదే అలవాటుతో దేవుడు, సాధన, ముక్తి వంటి ఆధ్యాత్మిక విషయాల్లో కూడా మనసు పోల్చుకోవడం, పోటీ పడటం చేస్తోంది. నిజానికి మనజీవనం సాఫీగా సాగటానికి ఎవరితోనూ పోటీ పడక్కర్లేదు. 

మనతో మనంసక్రమంగా ఉంటే సరిపోతుంది.

మన గుణాలను దాటటానికి, ప్రవృతిని మార్చుకోవడానికి అనుదినం మనతో మనమే పోటీపడాలి. మనలో వచ్చే మార్పే శాంతికి సోపానం. మనలో ఆధ్యాత్మిక ఎదుగుదలకు శాంతే కొలమానం. దీన్ని ఎవరినీ అడిగి తెలుసుకోవాల్సిన పనిలేదు. మనం నిత్యజీవితంలో ఎంత శాంతిగా ఉంటున్నాం, ఎన్ని విషయాల్లో శాంతిగా ఉంటున్నామనేది ఎవరిది వారికే తెలిసే విషయం ! 

స్వస్తి....... 

ఇదే సనాతన ధర్మ విశిష్టత... 

*సనాతన ధర్మస్య రక్షిత-రక్షతః**

ప్రసాద్ సింగ్ 

Quote of the day

The life ahead can only be glorious if you learn to live in total harmony with the Lord.…

__________Sai Baba