Online Puja Services

శ్రీ సుబ్రహ్మణ్యస్వామి చరితం 3 వ.భాగం.

3.139.86.227
కొంతకాలము తరువాత, ఒకనాడు బ్రహ్మదేవుడా బాలునగాoచ రాగా ఆ కృత్తికలు పరమానందముతో ఆ వాణీపతికి గౌరవించి ఉచితాసనమునిచ్చి గౌరవించి ఆ చతుర్ముఖునికి బాలుని చూప, ఆయనాబాలుని జాతకాకర్మాదులు రచించి 'కుమారుడు' అను నమధేయం చేశారు. ఆ ఆరుగురు మిగుల ఆనందించారు.

వాణీ నాధుడు ఆ కృత్తికలను జూచి "మునిపత్నులరా! ఈ కుమారుడు అసమాన్య త్రైలోక్య వీరవిక్రమ శిఖామణి. అంతేకాదు దేవతల కొరకు శివవీర్యం సంజాతుడగుటచే "స్కందుడు, అగ్నిభట్టారుకుని వలన జన్మించుట వలన "అగ్నిభవుఁడు", గంగానదిలో వుండినందున "గాంగేయుడు" అని కీర్తింపబడి, "కార్తికేయుడు" అని మిమ్ము కీర్తింప,మీపేరిట పిలువబడుతాడు. కార్తికేయులు బహుళముగా వుండుటచే "బాహులేయుడన బడతాడు. శివవేరీస్ము వలన ఉద్భవించుటచే జగత్పావనుండై "పార్వతీ తనయుడిగా పేరుపొందగలడు.కాల క్రమాన సమస్త దేవ సేనా నాయకుడగుటచేత "దేవసేనాని" అని ప్రసిద్ధిగాంచును.ఇంకను గుహుడు, కుమారుడు,విశాఖుడు, క్రౌంచదారణుడు అని పిలువబడుతాడు అని ఆశీర్వదించి వెళతాడు.

ఇలా ఉండగా, పార్వతి పరమేశ్వరులకు తమ కుమారుడు కృత్తికలవద్ద పెరుగుతున్నట్లు ఆగ్నిదేవుడి ద్వారా తెలిసికొని, నంది ని పంపి పిలుచుకొని రమ్మంటారు. నంది అటచేరు సమయానికి స్వామి ఆరుగురు తల్లుల ముద్దుమురిపాలలో ఆడుకుంటున్నారు. నంది శివ రుద్ర భూతగణాలతో రావడం గమనించిన తల్లులు భీతిల్లాగా, స్వామి, "తల్లులారా! మీకేమి భయము వలదు. ఎందరు వచ్చినా అందరిని క్షణంలో నే గెలుస్తాను' అని అంటున్న కుమారుని వద్దకు నంది వచ్చి వినయముగా  ఇట్లనెను. కుమారా! కృత్తికా మాతలారా వినండి. త్రిలోకాధినాథుడు ఈశ్వరుడు ఈ కుమారుని కైలాసమునకు తోడ్కొని రమ్మని మము పంపారు. స్వామి పార్వతి పుత్రుడే కానీ కృత్తికా పుత్రుడు కాడు. దైవకార్యార్థమై పరమశివుని వీర్యమువల్ల భూలోకమున అవతరించాడు. అందువలన వారు పుత్రోత్సాహంతో, స్వామిని పిలుచుకరమ్మని నన్ను పంపారు అని అన్నాడు. ఆ మాటలు విన్న తల్లులు మ్రాన్పడి పోయారు. అంత స్వామి "అన్నా! నందికేశ్వరా! కృత్తికలు నాతల్లులు. వారి పాలు పోసి నన్ను వారి మాతృప్రేమ మీర సాకారు.కాన వారు నాకు పూజ్యనీయ మాతృమూర్తులు - వారూ నాకు మాతా పిత సమానులు"- అన్నాడు కుమారస్వామి.

నందికేశ్వరుడు పరమానందమo దాడు. ఆరుగురు కృత్తికామాతలు కుమారుని కౌగలించుకొని "కుమారా! నీవే మా పంచ ప్రాణాలు. మమ్మువీడి వెళుతున్నావా!"- అని దుఃఖించసాగారు.

అంత వారిని చూచి "మాతలారా! మిమ్ము నేనెన్నటికి విడువను. మీరు నా హృదయములో ఎప్పటికి పదిలంగా వుంటారు"- అని సాంత్వన పలికాడు కుమారుడు. అపుడు నందికెశ్వరుడు నూరు చక్రాలు కలది, విశ్వకర్మచే నిర్ర్మిత స్వర్ణ మణిమయ రథముపై కుమారుని, ఆరుగురు తల్లులను సాదరంగా తీసుకొని కైలాసం పయనమైనారు.

*********

మరోక్కకథనం 
శూరపద్ముడు, సింహముఖుడు, తారకాసురుడు అనే రాక్షసులు లోకకంటకులై దేవతలనూ, మానవులనూ బాధిస్తున్నారు. శివపార్వతుల ఔరస కుమారుడే వీరిని చంపగలడని బ్రహ్మ తెలిపాడు. తన పూలబాణాలతో శివుని తపస్సు భంగముచేసి ప్రణయములోనికి దింపాలని ప్రయత్నించిన మన్మధుడు శివుని కోపాగ్నికి భస్మమయ్యాడు. శివునినుండి వెలువడిన దివ్యతేజస్సు ఆరుభాగాలుగా విభజింపబడింది. వాటిని వాయువు, అగ్ని దేవుళ్ళు గంగానదిలో ఉంచారు. అవి ప్రవాహంలో వెళ్ళి ఒక వనంలో శరంలో (రెల్లుగడ్డిలో) చిక్కుకొని ఆరు చక్కని బాలురుగా మారాయి. వాటికి కార్తీక నక్షత్ర దేవతలు జోలపాడారు. విషయం తెలిసిన పార్వతి ‘స్కందా’ అని పిలుస్తూ వారిని అక్కున చేర్చుకోగా వారు ఆరు ముఖాలూ, 12 చేతులూ గల ఒకే బాలునిగా అవతరించారు. అందుకే ఆయనకు అన్ని పేర్లు వచ్చాయి
**********
కుమారస్వామి జననం, కైలాసము చేరటం, 
ఇoచుమించు కొద్ది తేడాతో పలు పురాణాలలో చెప్పబడినది. అవికూడా చూద్దాము.
 
- L. రాజేశ్వర్   

Quote of the day

The life ahead can only be glorious if you learn to live in total harmony with the Lord.…

__________Sai Baba