Online Puja Services

రామ భజన మహిమ

18.191.27.78
రామ భజన మహిమ
 
ఎక్కడ రామ భజన జరుగుతుందో అక్కడ హనుమంతుల వారు ఉంటారు. గ్రహ దోషాలు, చెడు ప్రయోగాలు జరిగాయి అని భయపడుతున్న వాళ్ళు, గాలి,పిశాచ బాధలు ఉన్నాయి అని భయపడుతూ, ఏ పూజలు చేయాలి ఎవరి దగ్గరకు వెళ్ళాలి అని మానసికంగా కృంగిపోతూ చాలా కుటుంబాలు మనో వేదన అనుభవిస్తున్నారు..అవి నిజంగా ఉన్నాయా లేక అపోహ అనేది పక్కన పెడితే అటువంటి ఆలోచనలతో చాలా మానసిక క్షోభ అనుభవిస్తున్నారు.
 
ఏ రోజు ఏమీ చేయమని tv లో భక్తి ప్రసారంలో చెప్తే అవి చేస్తున్నారు, ఏ స్వామి జి ఏది చెప్తే అది చేస్తున్నారు. మీలాంటి అమాయకుల వల్ల దొంగబాబాలు, తాయత్తులు అమ్మే వాళ్ళు, యంత్రాలు అమ్ముకునే వాళ్ళు చాలా మంది హాయిగా బతుకు తున్నారు కానీ మీ సమస్యలు మటుకు తీరడం లేదు..
 
ఇంట్లో రామ భజన నిరంతరంగా ప్రతి రోజు రామ భజన ఇంట్లో చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళను పిలవండి. సంజీవిని తెస్తున్న హనుమంతుని ఫోటో కానీ, రామ లక్ష్మణులను భుజాన మోస్తున్న హనుమంతుని ఫోటో కానీ పెట్టుకోండి. అలాగే సీతారామ పట్టాభిషేకం ఫోటో పెట్టుకోండి ఇది ప్రతి ఇంటా ఉండవలసిన ఫోటో. పానకం. వడపప్పు నైవేద్యం పెట్టండి. మంగళవారం గారెలు నైవేద్యం పెట్టండి... భక్తి పారవశ్యంతో రామ భజన చేసి చివరిలో హనుమాన్ చాలీసా చదివి హారతి ఇవ్వండి... ఏ పిశాచాలు మీ ఇంట్లో ఉంటాయో చూద్దాము. గ్రహాలు అన్నీ హనుమకు అధీనం లో ఉంటాయి. ఎందుకంటే ఆయన భక్తికి మరో రూపం రుద్ర స్వరూపం.. శనిదోషాలు, రాహుగ్రహ దోషాలను పోగొట్టే సులభమైన మార్గం హనుమంతుడి గుడి సందర్శన...ఆరాధన..
 
ఇంట్లో గొడవలు తగ్గి మన శాంతిగా ఉంటారు, దుష్ట గ్రహాలు అనగా మీకు చేడుచేసే వారు కూడా మీ ఇంట్లోకి రాలేరు ఇంటికి ఉన్న కనుదిష్టి పోతుంది..ఇంటి వాతావరణంలో లో మంచి మార్పు మీకే తెలుస్తుంది.. సంతోషంగా ఉంటారు.. రామ భజన గురించి మీకు ఇంతకన్నా నేను చెప్పాలా.."ఓ రామ నీ నామం ఎంతో రుచిరా" అంటూ అలవాటు పడితే అందులోని ఆనందం అనంతం , ఎంతో మందికి సుందరకాండ పారాయణం, శ్రవణం ఎంతో మేలు చేసింది..అలా పారాయణం చేయలేక పోయిన రామ భజన, ఇంట్లో పెట్టండి సంతోషంగా ఉండండి. దీని వల్ల మీ పిల్లలు చిన్న తనం నుండి భక్తిని అలవాటు చేసుకుంటారు పాప బీతి ఉంటే తప్పులు చేయరు అబద్దం చెప్పరు.
 
శివుడుస్మరించే తారక మంత్రం రామ నామం ఈ మంత్రం నిరంతరం జపించండి.
 
"శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే |
సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే |"
 
రామ భజన
రామ రామ రఘునందన రామరామ శ్రీరామ రామ భరతాగ్రజ రామరామ
శ్రీరామ రామ రణకర్కశ రామ రామ శ్రీరామ రామ శరణం భవ రామ రామ ॥
 
లోకాభిరామం రణరంగధీరం రాజీవనేత్రం రఘువంశనాథమ్ 
కారుణ్యరూపం కరుణాకరం తం శ్రీరామచంద్రం శరణం ప్రపద్యే ॥
 
మనోజవం మారుతతుల్య వేగమ్ జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టమ్
వాతాత్మజం వానరయూథ ముఖ్యమ్ శ్రీరామదూతం శరణం ప్రపద్యే. ॥
 
(ఎన్నో లక్షల రాక్షస సంహారం చేసిన రాముడు సదా మంచిని రక్షించు గాక, శ్రీ రామ నీకు జయము నీ నామము మాకు శుభము)
 
జై శ్రీరాం..   నీకు జయము,  నీ నామము మాకు శుభము.
 
- భారతీయుడు & కందుకూరి శ్రీను 
 
 

Quote of the day

Holding on to anger is like grasping a hot coal with the intent of throwing it at someone else; you are the one who gets burned.…

__________Gouthama Budda