Online Puja Services

ఎక్కువ గాయత్రి చెయ్యి

3.134.97.32

సేంగలిపురం శ్రీ అనంతరామ దీక్షితర్ల శిష్యులు ఒకరు వారి ప్రవచనం విని సహస్ర గాయత్రి జపం చేశారు. ఇంటికి దగ్గరలోని ఒక పుణ్య ప్రదేశంలో ఈ సహస్ర గాయత్రి జపం చేశారు. ఒక నెలపాటు మంత్రంపై నిష్టతో సహస్ర గాయత్రి చేస్తే, పాము తన కుబుసాన్ని వదిలినట్టు మనల్ని అంటుకుని ఉన్న పాపములు అన్ని వెళ్లిపోతాయి అని దీక్షితర్లు చెప్పిన విషయాన్ని ఆజ్ఞగా భావించి పూర్తీ చేశాడు.

ముప్పైరోజులు పూర్తీ చేసిన తరువాత పరమాచార్య స్వామివారి దర్శనానికి కలవై వెళ్ళాడు ఆ భక్తుడు. మహాస్వామివారి గురు, పరమ గురువుల బృందావనాలను ప్రదక్షిణం చేస్తున్నాడు ఆ భక్తుడు. మహాస్వామివారు అక్కడ తూర్పు ముఖంగా కూర్చుని ఉన్నారు.

ఈ భక్తుడు ఎవరితోనూ ఏమి చెప్పలేదు. తనను తాను ఎవరికీ పరిచయం కూడా చేసుకోలేదు. ప్రదక్షిణం చేస్తూ, తూర్పు వైపు మూలకు రాగా, అక్కడ కూర్చున్న మహాస్వామి వారు ఎవరితోనో దీక్షితర్ గారి గురించి చెప్పడం చెవినపడింది. అతనికి చాలా ఆశ్చర్యం కలిగింది. దీక్షితర్ ఉపన్యాసం విన్న తరువాత ముప్పై రోజులపాటు సహస్ర గాయత్రి చేసి ఇక్కడకు వస్తే, పరమాచార్య స్వామివారు దీక్షితర్ గురించి మాట్లాడడం ఆనందం కలిగించింది. మహాస్వామి వారికి అన్ని విషయములు తెలుసు అని అనుకున్నాడు ఆనందంతో.

శ్రీవారు ఏం చెబుతున్నారో వినడం మొదలు పెట్టాడు. దీక్షితర్ గారు చాలా చోట్ల వారి ఉపన్యాసాలలో నిత్యకర్మానుష్టానము గురించి ఎప్పుడూ చెబుతూ, స్వతహాగా ఆచరిస్తూ, దాని ప్రాముఖ్యతను వివరించడం వల్ల ఎందరో వాటిని పాటిస్తున్నారు. దీక్షితర్ గారి బంధువుల పేరు కనుక్కుందామని అక్కడున్న వారిని అడిగి ఒకసారి వెనుకకు తిరిగారు.

మి వెనుక ఎవరైనా ఉన్నారా అని శిష్యుల్ని అడిగారు స్వామివారు. ఈ భక్తుడు నిలబడి ఉన్నాడు అని చెప్పారు శిష్యులు. మహాస్వామివారు అతణ్ణి చూసి, “గాయత్రి ఎక్కువ చెయ్యి” అన్నారు. ఆ భక్తుడు ఆనంద పరవశుడయ్యాడు. తనగురించి అక్కడున్నవారికి ఎవరికీ చెప్పకపోయినా, పరమాచార్య స్వామివారు తనగురించి అన్నీ తెలుసుకున్నారు. ఆ సమయంలో అతనికి మహాస్వామివారు సాక్షాత్ ఈశ్వరునిలా అగుపించారు.

అతను సేలంలోని దీక్షితర్ అధిష్టానంలో జపం చేస్తున్నానని చెప్పగానే, మహాస్వామివారు ఎదపై తమ కుడిచేయిని ఉంచుకుని నాకు అంతా తెలుసన్నట్టుగా సంజ్ఞ చేశారు.

--- శ్రీ శ్రీ శ్రీ మహాపెరియవ మహిమై

అపారకరుణా సింధుం జ్ఞానదం శాంత రూపిణమ్
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

Quote of the day

If you shut the door to all errors, truth will be shut out.…

__________Rabindranath Tagore