ఏది మంచిది
దేవుని పాదాలపై పూలు పెట్టేందుకు గుడికి వెళ్ళకు,
ముందుగా మన ఇంటిని, మనసుని దయ, ప్రేమ, వాత్సల్యాల పరిమళాలతో నింపుకోవడం మంచిది....
దేవుని ముందుదీపాలు వెలిగించేందుకు గుడికి వెళ్ళకు,
ముందుగా మన లోపలి పాపం, గర్వం, అహంభావాలెనే చీకటిని హృదయం నుండి తొలగించుకోవడం మంచిది....
తల వంచి ప్రార్థించేందుకు గుడికి వెళ్ళకు,
ముందుగా మన తోటి వారి ముందు వినయంగా ఉండటం నేర్చుకోవడం మంచిది....
మోకాళ్ళ మీద కూర్చుని ప్రార్థించేందుకు గుడికి వెళ్ళకు,...
ముందు మనం చేసే దోషం వల్ల, బాధ పడ్డవారికి, క్షమాపణ చెప్పుకోవడం మంచిది...
మనం చేసిన పాపాలకు క్షమించమనిఅడిగేందుకు గుడికి వెళ్ళకు,
ముందుగా మనలను గాయపరిచిన వారిని హృదయ పూర్వకంగా క్షమించడము నేర్చుకోవడం మంచిది....
అప్పుడు మన హృదయమే దేవాలయము అవుతుంది...
ఆ దేవుడు మనలోనే కొలువై మనకు ఏమి, ఎప్పుడు ఇవ్వాలో ఆయన చూసుకుంటాడు.....
- whatsapp sekarana