Online Puja Services

ప్రేమించే తండ్రి వున్నంతకాలం ఏ కూతురయినా ధనవంతురాలే

18.191.53.120
అనుకోకుండా తన ఇంటికి వచ్చిన తండ్రిని చూసి కూతురు ఎంత సంతోషించిందో అంత ఖంగారు పడింది!
 
దూరం నుంచి వచ్చిన తండ్రి భోజనం చెయ్యకుండా ఎలా వెళతాడు .....?
కానీ ఇంట్లో బియ్యంలేవు, 
 
డబ్బాలోంచి వూడ్చి వూడ్చి తీస్తే 
సోలెడు కూడా లేవు, 
 
తన అడుగంటిన సంసారం 
కన్నతండ్రి కంట పడక తప్పేట్టు లేదు! 
కూతురి ఆందోళన తండ్రి గమనించాడు! 
 
ఏదో పనున్నట్టు వంటింట్లోకి వెళ్ళి 
అన్ని డబ్బాలూ మూతలు తీసి చూశాడు.
 
 బాధతో ఆయన మనసు కృంగిపోయింది.. 
ఎంత గారంగా పెంచాడు పిల్లని!! 
అల్లుడు నిక్షేపం లాంటి ఉద్యోగం మానేసి..
 
వ్యాపారంలోకి దిగి నష్టాల పాలయి 
సంసారం ఈ స్తితికి తెచ్చాడు! 
 
" ఇప్పుడే వస్తా తల్లీ " అని బైటకి వెళ్ళాడు, 
 
తండ్రి వచ్చాక ఏం సంజాయిషీలు చెప్పుకోవాలా అని కూతురు దిగులుగా ఆలోచిస్తోంది! 
 
"ఇక్కడే అబ్బీ ఆపు " రిక్షా దిగిన నాన్న సామానంతా ఇంట్లోకి చేర్పించాడు బియ్యం బస్తా తో సహా! 
 
ఏమీ అనలేక కూతురు గుడ్లనీళ్ళు కుక్కుకుంది ..
 
" ఊరుకో తల్లీ , ఓర్చుకుంటే ఓరుగల్లు పట్టణమవుతుందంటారు , ఓర్పుగా వుండు , నీకూ మంచిరోజులొస్తాయి "ఓదార్చాడు! 
 
ఆయన అన్నట్టే జరిగింది, మంచి రోజులొచ్చాయ్! 
 
కూతురి ఇంటినిండా దేనికీ లోటు లేకుండా ఓ మూల బియ్యం బస్తాలూ, వంటింట్లో నిండుగా సరుకులు.. కన్న తండ్రి హృదయం, కడుపూ రెండూ నిండిపోయాయి, అయినా కూతురి తృప్తి కోసం నాలుగు మెతుకులు తిని లేచాడు !
 
 వెళ్ళేటప్పుడు నాలుగొందలు చేతిలో పెడుతోంటే " ఎందుకు నాన్నా , ఇప్పుడు మా పరిస్తితి బాగానే వుంది " అంది మొహమాటంగా .
 
 " బాగాలేదని కాదమ్మా ! నా సంతృప్తికోసం ఇస్తున్నా , పండక్కి చీర కొనుక్కో " అన్నాడు
 
 చెమ్మగిల్లిన కళ్ళు కూతురు చూడకుండా కండువాతో తుడుచుకుంటూ! 
 
(ప్రేమించే తండ్రి వున్నంతకాలం ఏ కూతురయినా ధనవంతురాలే !!)
 
- L. రాజేశ్వర్ 

Quote of the day

As a single withered tree, if set aflame, causes a whole forest to burn, so does a rascal son destroy a whole family.…

__________Chanakya