మణికంఠుడు - చింతామణి
మొదట మనం మణికంఠుని గురించి తెలుసుకుందాం
స్వామి శరణం స్వామియే శరణం అయ్యప్ప!
మహిషిని సంహరించవలసిన కాలం సమీపించిన కారణం చేత ఋషులు దేవతలు హరిహరులు శ్రీ ధర్మశాస్త్ర భూలోకంలో అవతరించఅని కోరారు. వారి కోరిక కు అనుగుణంగా శ్రీ ధర్మ శాస్త మానవ దేహాన్ని దాల్చి పసిబాలుడు గా మారాడు.
శ్రీమన్నారాయణ మహిమలు గల చింతామణిని ఆ పసి బాలుని కంఠము నందు కంఠాభరణము గా అలంకరిస్తారు. ఆ తరువాత హరిహరులిద్దరూ కలిసి పవిత్ర పంపా నది తీరముందు ఆ పసి బాలుడుni విడిచిపెట్టి అదృశ్యం అవుతారు.
* మణికంఠుని కంఠమందు ఉన్న మణిహారం మహిమల గురించి తెలుసుకుందాం*
అవును! "మణికంఠుని మెడలో ఉన్న మణిహారం మహిమలు కలిగిన మణిహారమే!"
'ఆ మణి పేరేమిటి? ఆ మణి పేరు
*చింతామణి అది దేవమణి *.
చింతామణి కి ఎటువంటి శక్తి కలదు? ధ్యానించే వారికి కోరికలు తీర్చ గల శక్తి కలదు.
చింతామణి ఎటువంటి మహిమలు కలవు?
ధర్మబద్ధమైన కోరికలను ఎవరు కోరిన, ఆ కోరికలను అన్నిటిని తీర్చగల మహిమలు" చింతామణికి" కలవు.
" శ్రీమన్నారాయణుడు మహిమలు గల" చింతామణిని"
పసి బాలునికి (అనగా మణికంఠునికి) ఎందుకు అలంకరించవల వచ్చింది.?
మణికంఠుడు తాను ఏది కోరితే అది జరగాలని ఉద్దేశంతోనే" నారాయణుడు చింతామణిని" మణికంఠునికి అలంకరించ వలసిందిగా వచ్చింది.
*చింతామణి మణికంఠనకు ఏ ఏ సందర్భాలలో ఉపయోగపడింది ? *
1:గురుకుల ఆశ్రమంలో మాటలు రాని గురు పుత్రునకు మాటలు వచ్చేలా చేసిన సందర్భంలో మణికంఠనకు "చింతామణి" ఉపయోగపడింది.
2: పులిపాలకోసం అడవికి వెళ్ళినపుడు ఆ అడవిలో వావర్ తో యుద్ధం చేసినప్పుడు ఓడించడం లో చింతామణి ఉపయోగపడింది.
3: మహిషిని వధించడoకోసం మణికంఠుడు భూలోకం నుండి దేవలోకానికి వెళ్లాలి. కానీ దేవలోకం లోనికి ప్రవేశించే అర్హత మానవ దేహానికి లేదు. ఆ స్థితిలో మణికంఠుడు మానవదేహం తో దేవలోకానికి వెళ్లేందుకు "చింతామణి" ఉపయోగపడింది.
4: మణికంఠుడు మహిషిని సంహరించాకడం లోనూ "చింతామణి" ఉపయోగపడింది.
5: మహిషి సంహారం తరువాత మణికంఠుడు భూలోకానికి వచ్చినప్పుడు మరియు పులిమందలతో రాజ ప్రసాదానికి వచ్చినప్పుడు "చింతామణి" ఉపయోగపడింది.
6: ధర్మశాస్త చతుర్ఆశ్రమాలను ఆచరించడంలో "చింతామణి" ఉపయోగపడింది.
ధర్మానికి అధిపతి ధర్మ బోధకుడు అయినా శ్రీ ధర్మ శాస్త మానవ దేహాన్ని దాల్చాడు కనుక చతురాశ్రమ ధర్మాలు అనుసరించి జ్యోతి స్వరూప అవ్వాలి. ఇందుకోసం శ్రీ ధర్మశాస్త చతుర ఆశ్రమాలను ఆచరించవలసి వచ్చింది.
అట్టి చింతామణి నీ కలిగియున్న మణికంఠుని కీర్తిస్తూ మణిమాల జ్వాలా :కంఠాయ నమః అని *చింతామణి విభూసితాయ నమఃఅనే నామాలు స్వామివారి సహస్రనామాలలో యుండి మణికంఠుని గా అవతరించిన ధర్మశాస్త్ర నమస్కృతులు అందజేసింది.
స్వామి శరణం స్వామియే శరణం అయ్యప్ప
- L. రాజేశ్వర్