పనులు మానేసి ప్రార్ధన అవసరం లేదు
అన్ని పనులు ఆపి దేవునికోసం సాధనచేసే వారికి ఎప్పటికీ అనుగ్రహం కలుగుతుందో చెప్పలేము వారి ప్రయత్నం ఫలించే వరకు సాధన చేస్తూ ఉంటారు.
ఏ పనులు చేస్తున్నా నిత్యం నామ స్మరణ(జపం) చేసే వారి వెంట దేవుడు ఎప్పుడూ ఉంటాడు, తన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ కూడా దైవాన్ని మరువని వారి పిలుపు భగవంతుడు వింటాడు ఆ భక్తుడికి తనవద్దకు రావడానికి సమయం లేకున్నా తనను పిలుస్తూనే తలుస్తూనే ఉన్నాడు అని ఆ దైవమే భక్తిని వద్దకు వెళ్తాడు, నీ వెంటే ఉండే స్వామి నీకు కనపడకపోయినా నువ్వు నీ స్వామికి కనిపిస్తూనే ఉంటావు ఆ దృష్టి పడాలనే కదా ఎన్నో పాట్లు, అలా నీ ప్రతి కర్మలోనూ సాక్షి గా నిలుస్తాడు అలా ఉంటే ఏమవుతుంది నీ కష్టమైన పని తేలికగా ఉంటుంది నీవు భారంగా అనుకునే పని బాధ్యతగా మారుతుంది, నీకు రావాల్సినది న్యాయంగా అందుతుంది, నీ సామర్ధ్యం కి ఆ పని తగదు అని నీవెంట ఉండే స్వామి అనుకుంటే నీకు తగిన చోటికి ఆ దేవుడే మారుస్తాడు నీ కష్టానికి తగిన జీతం లభించడం లేదు అని అనుకుంటే తగిన ధనం అందే ఏర్పాటు చేస్తాడు నువ్వు నిజాయితీగా ఉండాలి అంతే . మనము ఏది నిత్యం స్మరిస్తూ ఉంటామో ప్రకృతి దాన్ని మన చెంతకు చేరుస్తుంది. అది పొందే అర్హత కూడా మనకు ఉండాలి.
చాడీలు, అపద్దాలు, అశుభ్రత, బద్దకం, ఎప్పుడూ ఒకరి బాగు చూడలేక ఏడుస్తూ ఉండటం, ఇతరుల సొమ్ముకి అసపడటం, ఇటువంటి లక్షణాలు ఉన్న వారికి దూరంగా ఉండండి వీరి చుట్టూ నెగటివ్ ఎనర్జీ చాలా ఉంటుంది దానివల్ల మీరు మిగురించి ఏది వాళ్ళతో చెప్పుకున్నా ఆ పని ముందుకి వెల్లదు వారి స్నేహం వల్ల మీకు ఏ శుభం జరగదు కనుక అటువంటి వాళ్ళతో దూరంగా ఉండాలి
- భానుమతి అక్కిశెట్టి