మంత్రసిద్ధికి ఉపాయాలు:...
విధి విధానంగా మంత్రపుశ్చరణం చేసినా మంత్రం సిద్దింపకుండా ఉంటే తిరిగి మళ్లీ ఆ మంత్రాన్ని పురశ్చరణ చేయాల్సిందే !! జన్మాంతరార్జిత పాపములు ( అంటే పూర్వ జన్మ లో చేసిన పాపం , తల్లి తండ్రుల నుండి వచ్చిన పాపం , ఈ జన్మలో ఇది వరకు నువ్వు చేసిన పాడు పనులు ) మంత్రసిద్ధికి రకరకాల ఆటంకం కలిగిన తిరిగి మళ్లీ పురశ్చరణ చేయాల్సిందే.. ఈ విధంగా మూడు సార్లు ( అంటే ఆ మంత్రాన్ని మూడుసార్లు పురశ్చరణ చేయాల్సిందే ఒక వేళ ఈ మూడు సార్లు పురశ్చరణ చేసినా కూడా ఆ మంత్రాం సిద్దించక పోతే .. తంత్ర శాస్త్రం 7 రకాల ఉపాయాలు ( పరిష్కార మార్గాలు చూపుతోంది ) అవి ఈ కింది గమనించండి .
1. *భ్రామణము :-* కర్పూరం , గంధం , కూంకుమ మొదలైన రసముల మిశ్రమాలతో ఒక వాయు బీజం ( యం ఆనే బీజం ) ఒక మంత్రాక్షరము , మరోక వాయుబీజం , మంత్రమందలి రెండవ అక్షరం అనువిధాముగా మంత్రం యందలి అన్ని అక్షరాలను వాయు బీజాన్ని సంపుటితో వ్రాయాలి . అలా పూర్తి మంత్రాన్ని వ్రాసిన యంత్రముని విధి విధానాలతో ధూప దీప నైవేద్యాలు సమర్పించి పూజించి జపం , హోమం , బ్రాహ్మణ భోజనం చేసి , వారికి తగిన దానం చేయాలి .. ఈ విధానాన్ని భ్రామణం అని తంత్ర శాస్త్రం చెబుతోంది . తర్వాత మంత్ర పురశ్చరణ చేసిన వేగంగా సిద్ది కలుగును .
2 . *రోదనం :-*
వాగ్భీజం ( అంటే ఐం ) తో సంపుటి ( సంపుటి అంటే కలపడం ) సంపుటి చేసిన మూల మంత్ర జపం ఈ విధానాన్ని రోదనం అని శాస్త్రం చెబుతోంది ..
3 . *వశీకరణం :-*
అలక్తకము ( లక్క ) రక్తచందనము , కూట , దత్తూరబీజములు , మణిశిలలను మిశ్రమం చేసి భూర్జపత్రపత్రం పై లేదా ఓ రాగి రేకు పై మంత్రాన్ని లిఖించి సాధకుడు తన కంఠమున ధరించిన వశీకరణ అని శాస్త్రం చెబుతోంది.
4 . *పీడనం :-*
అధరోత్తయోగముతో మంత్రజపం , అధరోత్తర స్వరూపిణియగు దేవతా పూజను చేయాలి .. ఆ తర్వాత జిల్లేడు పాలతో మంత్రాన్ని లిఖించి దానిని హోమం చేయాలి . ఇది పీడనం అంటారు .
5 . *పోషణం:-*
వధూబీజము ( స్త్రీం) అనే బీజం తో మూల మంత్రాన్ని సంపుటి చేసి మంత్రజపం చేసి , ఆవుపాలతో ఆ మంత్రాన్ని వ్రాసిన చేతికి కట్టుకొనుట పోషణం అంటారు .
6 . *శోషణం:-*
వాయు బీజం ( యం) అనే బీజం తో ఆ మంత్రాన్ని సంపుటి చేసి జపించి యజ్ఞభస్మంతో రాగి పత్రముపై మూల మంత్రాన్ని వ్రాసి కంఠమున ధరించడాన్ని శోషణం అంటారు .
7. *దాహానము:-*
మంత్ర యందలి వర్ణములతో అగ్ని బీజం ( రం) అనే బీజాల్ని జోడించి జపం చేసి ఫలాశ ( మోదుగ ) విత్తనముల నుంచి తీసిన తైలం తో మంత్రాన్ని లిఖించి కంఠమున ధరించే ప్రక్రియ ను ధాహానం అంటారు .
ఈ ఏడు ( 7 ) రకాల ఉపాయాలనూ అనుసరించాలని నియమం లేదు .. ఏదో ఒక ఉపాయం తో ఆ మంత్రం సిద్దించనప్పుడు రెండవ ఉపాయం , అప్పుడు కూడా సిద్ది కలుగుక పోతే మూడవ ఉపాయం ఇలా క్రమం తప్పకుండా చేయవలసిన అవసరం ఉంది .. ఈ ఉపాయాల ద్వారా తప్పకుండా మంత్రం సిద్ధిస్తుంది అని ఎన్నో మంత్ర శాస్త్ర గ్రంథాలు , ఎంతో మంది సిద్ది పొందిన మహానుభావులు వారి అనుభవం ద్వారా తెలియజేశారు .
*ఇప్పుడు ఉపాసన చేస్తున్న మంత్రం సిద్దించిందా !? లేదా? అని ఎలా తెలుసుకోవచ్చనో చూద్దాం:-*
సాధకుడికి *మనసు- మంత్రం- దేవతా* ఈ మూడు వేరు వేరు గా తోస్తూ ఉంటుంది . అయితే పురశ్చణాది క్రియల ద్వారా ఈ త్రిపుటి ( అంటే మనసు - మంత్రం - దేవత ) అనే భావన నశించి , ఈ మూడు తన ఇష్ట దైవ రూపంగానే భాసిస్తుంది .. ఈ స్థితిలో సాధకుడు , సాధన , సాధ్యం ( సాంధించదలచినది ) అనే మూడింటిలో భేదం కనబడదు !! అలాంటి ఏకత్వ సిద్ది లభించినప్పుడు సాధకుని లో రోమాంచితము ( వెంట్రుకలు నిక్కబొడుచుకు ఉంటాయి ) స్తబ్దత ఏర్పడతాయి . అతని కంటి నుంచి ప్రేమాశ్రువులు ( ఆనందబాష్పాలు ) శ్రవిస్తాయి . మనస్సు , మంత్రములు దైవంలో విలీనమైనప్పుడు సాధకుడికి సమాధి స్థితి కలుగుతుంది . ఇలాంటి సమాధి స్థితిని సాధకుడు పొందటమే మంత్ర సాధన యొక్క అంతిమ ఫలితం అదే మంత్ర సిద్ధి అదే దేవతా దర్శనము గా చెప్పాలి .
ఇలాంటి సమాధి స్థితే సాధకులకు లభిస్తుందో ఆ సాధకునకు ఆ మంత్రం సిద్ధించింది అని చెప్పాలి .సాధకుడిలో అలాంటి సమాధి స్థితి లంబించనిచో ఆ మంత్రం సిద్దించలేదు అని గ్రహించాలి. అలాంటి స్థితిలో మంత్ర సిద్ధిని పొందడానికి ఏఏ కర్మలను ఆచరించాలి అని పైన చెప్పిన 7 ఏడు ఉపాయాలు లేదా దానికి తగిన కర్మలను ఆచరించి మంత్రసిద్ధికి ప్రయత్నం చేయాలి .
*సాధకుడు మంత్రం, దైవం* ఈ మూడూ ఒకటే అనుభావాభవమే సమాధి అలాంటి సమాధి స్థితిని అనుభవించు సాధకుడు తనకు ఆ మంత్రం సిద్ది అయింది అని గమనించాలి . అలా సిద్ది పొందిన మంత్రాన్ని ఉపయోగించి ఎలాంటి కామ్య కర్మలునైనా పొందగలడు అనేది సత్యం అదే మంత్ర సిద్ధి , యోగ సిద్ది , ఆ సాధకుడే యతి అవుతాడు , అవధూత ,
నిజంగా అలాంటి సిద్ధిని పొందిన సాదకుడిలో తన కోరికలు ఏమిటో అనే జ్ఞానం ఉండదు .. ఆ కోరికలపై మక్కవ చూపడు .. ఆ సాధకుడిలో ఆ దేవత ఆనంద నర్తనం చేస్తుంది .. అతడి భార్య పిల్లలు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆ దేవత అతడి ప్రమేయం లేకుండానే అతని బాధ్యతని చూసుకుంటుంది .. అది ఓ సచ్చిదానంద స్థితి .. ఆ సాధకుడిలో స్వార్ధ పూరిత భావాలు పూర్తిగా నశించి పోయి నిరంతరం సర్వకాల సర్వావస్థల యందు ఈ సమస్త ప్రకృతితో ఆ దైవాన్ని దర్శిస్తునే ఉంటాడు .. లోకకల్యాణమే అతని కాంక్ష .. సేవ .. ప్రేమ ... ఆనందం.. సృజనాత్మక శక్తి.. అతని హృదయం లో నిరంతరం సౌందర్యం వెదజల్లుతూ ఉంటుంది .. అందుకోసమే తన క్రియాకలాపాలు .. అలాంటి లోకకల్యాణం కోరే సాధకుడి కోరిక ఆ దేవత తప్పకుండా అతి శీఘ్రముగా నెరవేరుస్తుంది ..
అదే సిద్ది .. అదే దాని పూర్తి ఫలం..అతడే సిద్ధుడు .. ఈ విధంగా లోకకల్యాణం కోరే నిస్వార్థ సాధకుడికి ఏ మంత్రం అయినా సిద్ధిస్తుంది.. అసలు ఆ సాధకుడికి ఏ మంత్రంతోనూ పని ఉండదు .. ఏ దేవత అయినా అతన్ని సదా సర్వదా రక్షిస్తుంది.. తన వెంటే ఉంటుంది .. ఇది సత్యం .. పరమ సత్యం .. ఇందులో ఏ సందేహమూ లేదు .. అనుమానం లేదు.. ఇదే అనుభవ వేధ్యం !! ఎందరో మహానుభావులు , యతులు , సిద్ద పురుషులు ఇలా ఎన్నో ఎన్నో ఈ చరిత్రలో .. ఇలాంటి సిద్దియే మంత్ర సిద్ధి అని ప్రతీ సాధకుడు గమనించండి .. గ్రహించాలి.
9542552784
అనన్యానంద