సకల పురుషార్ధ ప్రధాయినీ తంత్రం..........!?
ఈ విషయాన్ని గూర్చి శంకరులు, "సౌందర్యలహరి" లోని 31 వ శ్లోకాన్ని, ఇలా రచించారు,
చతుషష్ట్యా తంత్రైః - సకల మతిసంధాయ భువనం
స్ధిత స్తత్తత్సిద్ధి - ప్రసవపరతంత్రైః పశుపతిః
పున స్త్వన్నిర్భంధా - దఖిల పురుషార్ధైకఘటనా
స్వతంత్రం తే తంత్రం - క్షితితల మవాతీతర దిదమ్
శ్రీ కనకదుర్గా మాత యొక్క సమ్యక్ (సంపూర్ణమైన) ఆరాధన చేసి పూర్ణ ఫలితమును పొందటానికి మనకు యంత్రము, తంత్రము, మరియూ మంత్రము అనే మూడింటిపై అవగాహన ఉండాలి.
యంత్రమనగా, 'శ్రీయంత్రం' అనగా 'శ్రీచక్రం' .
మంత్రం అనగా, 'శ్రీ మంత్రం' అనగా షోడశాక్షరి మరియు పంచదశాక్షరీ.
మరి, 'తంత్రము' అనగా....!?
మన ఇంట్లోదే కదా అని, నిప్పుని వొళ్ళో పెట్టుకుంటామా...!?
దేని మరియాద దానికి లేదా...!?
శ్రీ చక్రమును కొని ఎవరైనా ఇంట్లో పెట్టుకొనగలరు కానీ, అనుష్టానం తెలియాలిగా.
ఒక వస్తువును ఉపయోగించే పద్ధతికే అంత పెద్ద యూజర్ గైడ్ అవసరమైతే, మరి శ్రీ విద్యకి...!?
తంత్రము ( పద్ధతి) శాస్త్రము ఆమోదించినదై ఉండాలి.
"ఈశానః సర్వవిద్యానాం" అనగా, ఈశ్వరుడే, సర్వ విద్యలకు సృష్టికర్త అని, వేదము చెప్పింది.
'మహామాయా శాంబరము' మొదలుకొని 'విమలము' దాకా, అరువది నాలుగు తంత్రములను, 'చతుశ్శతి' అనే గ్రంథం వివరిస్తుంది.
ఈ అరువది నాలుగు తంత్రములేకాక, విమలోత్తరము, దేవీమతము, దిగంబర క్షపణకము అనే మరో మూడు తంత్రములు కూడా శాస్త్రములలో చెప్పబడ్డాయి.
ఆకాశ గమనము, పరకాయ ప్రవేశము, అంతర్ధానం కావడం, జలస్తంభన, అగ్నిస్తంభన, వాయుస్తంభన, మొదలైన విద్యలన్నీ ఈ తంత్రములలోనివే.
కేవలం భారతీయ సిద్ధులు మాత్రమే ఈ విద్యలను సాధించారు.
ఎవరెస్టు శిఖరాన్ని చూసిన వాడు దానిని విశ్లేషిస్తే, మూర్ఖుడు( skull nud) అంత పెద్ద శిఖరం ఉండే అవకాశమే లేదని వాదిస్తాడు. వదిలేయటమే.
అయితే ఈ తంత్రములు అన్నీ కూడా, సస్వానుభవాన్ని/ ఆత్మానుభూతిని/శ్రీ కనకదుర్గా మాతను ప్రసాదించలేవు.
కనుక, భక్తవత్సల అయినటువంటి శ్రీ కనకదుర్గా మాత, మనలను ఉద్దరింపజేసే తన యొక్క తంత్రమైన శ్రీవిద్యను, శివుని ద్వారా లోకములో అవతరింప చేసిందని ఈ శ్లోకము ద్వారా అమ్మవారిని శంకరులు శ్లాఘించారు.
అమ్మవారి యొక్క యంత్రము, మంత్రము, తంత్రము కలిపి శ్రీ విద్య.
శ్రీవిద్య తెలియకపోయినప్పటికీ, బాలభావానుసారేన తనను ఆరాధించే వారిని కూడా కటాక్షిస్తుంది
శ్రీ కనకదుర్గా మాత .
'బాలభావానుసారేన' అనగా, ఒక పసిపిల్లాడికి తన తల్లి ఏ పనిలో ఉన్నది అనేది వాడికి పట్టదు. ఆ పసి పిల్లాడు ఎప్పుడూ తన మాతృ దర్శనానికే పరితపిస్తూ ఉంటాడు. అమ్మద్వారా అన్నీ సాధించుకొంటాడు.
అదీ, 'అమ్మ'వారి ప్రత్యేకత.
శ్రీ శంకర భగవత్పాద విరచిత
సౌందర్య లహరి.
సౌందర్యలహరి మరియు శ్రీ లలితాసహస్రనామ సమన్వయ సాధనా మరియు శోధనా కొనసాగుతుంది.
శ్రీ కనకదుర్గా, దేవతా, పరదేవతా, నమోస్తుతే