Online Puja Services

మునగాకు – మానవుల పాలిట సంజీవని

18.116.12.7
మునగాకు – మానవుల పాలిట సంజీవని:
 
మునగాకు ను మానవుల పాలిట సంజీవనిగా భావిస్తారు. ఎందుకంటే 300 లకు పైగా వ్యాధులను నయం చేసే శక్తి వీటిలో ఉంది అని చాల పరిశోధనలలో తేలింది. మునగాకును వంటలలో వాడుతారని చాల మంది కి తెలియదు. మునక్కాయలను వాడినంతగా మునగాకును వాడరు. 4,5 వేల సంవత్సరాల నుండి వైద్యంలో చాల ప్రాముఖ్యత ఉంది.
 
పోషకాలు:
 
మనకు లభించే అన్ని ఆకు కూరల కంటే మునగాకులలో ఎక్కువ పోషకాలు, ఖనిజ లవణాలు ఉంటాయి. ఆందుకే దీనిని సంజీవనిగా పిలుస్తారు . మునగాకులో ముఖ్యంగా విటమిన్ ‘ఏ’ పుష్కలంగా ఉంటుంది . క్యారెట్ లో కంటే 10 రేట్లు ఎక్కువగా విటమిన్ ‘ఏ’ వీటిలో ఉంటుంది . ఇంకా విటమిన్ సి, కాలిషియం, ఐరన్, ఫైబర్ ఎక్కువగా లభిస్తాయి . పాలలో కంటే 17 రేట్లు ఎక్కువగా కాల్షియమ్, పెరుగులో ఉండే ప్రోటీన్ల కంటే 8 రేట్లు అధికంగా, అరటి పండ్ల కంటే 15 రేట్లు పొటాషియం ఎండిన మునగాకు పొడిలో లభిస్తుంది.
 
లాభాలు:
 
5 రకాల క్యాన్సర్ నివారణలో ఉపయోగపడుతుంది. మునగాకు యాంటీ ట్యూమర్స్ గా కూడా పనిచేస్తుంది.
 
థైరాయిడ్ ను రెగ్యులేట్ చేస్తుంది. షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది. మునగాకు కషాయం తీసుకోవటం వలన దృష్టి మాంద్యం, రేచీకటి తొలగిపోతాయి.
 
ప్రారంభ దశలో ఉన్న కీళ్ల నొప్పులకు మునగాకు లేపనంతో కట్టు కట్టుకోవటం వలన తగ్గుతాయి. చర్మ వ్యాదులకు కూడా మునగాకు లేపనం వాడుతారు.
 
మునగాకు రసాన్ని, దోసకాయ రసంతో తాగటం వలన గుండె, కాలేయం, మూత్ర పిండాల సమస్యలు క్రమంగా తగ్గిపోతాయి. మునగాకు రసం ఒక స్పూన్ కొబ్బరి నీళ్లలో కలిపి తాగటం వలన విరోచనాలు తగ్గుతాయి.
 
గర్భిణీలకు, బాలింతలకు మునగాకు రసం అమృతం లాంటిది. బాలింతలకు మునగాకు కూరలు చేసి తినిపించటం వలన పాల అభివృద్ధి ఉంటుంది.
 
మునగాకు రసాన్ని తీసుకోవటం వలన రక్తహీనత సమస్యలు తగ్గిపోతాయి. మునగాకు రసాన్ని పాలలో కలిపి పిల్లలకు తాగించటం వలన పిల్లలలో ఎముకలు దృడంగా తయారవుతాయి.
 
మునగాకు కషాయం తయారు చేసి అందులో ఉప్పు, మిరియాలపొడి, నిమ్మరసం కలిపి తాగితే దగ్గు, ఆస్తమా, టి.బి వంటి వ్యాదులు తగ్గుతాయి
 
- Praveen

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore