ప ఎదుట నెవ్వరు లేరు యింతా విష్ణుమయమే వదలక హరిదాసవర్గమైనవారికి చ ముంచిన నారాయణమూర్తులే యీజగమెల్ల అంచితనామములే యీయక్షరాలెల్లా పంచుకొన్న శ్రీహరిప్రసాద మీరుచులెల్లా తెంచివేసి మేలు దా దెలిసేటివారికి చ చేరి పారేటినదులు శ్రీపాదతీర్థమే భారపుయీ భూమితని పాదరేణువే సారపుగర్మములు కేశవుని కైంకర్యములే ధీరులై వివేకించి తెలిసేటివారికి చ చిత్తములో భావమెల్లా శ్రీవేంకటేశుడే హత్తినప్రకృతి యెల్లా నాతనిమాయే మత్తిలి యీతనికంటే మరి లేదితరములు తిత్తిదేహపుబ్రదుకు తెలిసేటివారికి
__________Rabindranath Tagore