ప్రార్థన ఫలించడము అంటే
భగవద్గీత శ్లోకము 4:11
శ్రీ భగవాన్ ఉవాచ
=============
మానవుడు ఏది పొందాలో నా పై ఆధారపడిలేదు.
కానీ అతని స్వేచ్ఛపై ఆధారపడి ఉన్నది.
ఎందుకంటే జీవుడు మనుష్య జన్మ తీసుకున్నప్పుడే తన లక్షయము సాధించడానికి స్వేచ్ఛ ఇవ్వబడుతుంది.నేను ఇవ్వదలుచుకున్నది నాపై కాకుండా వారికి ఏమి కావాలని కోరుకుంటారో దానిపై ఆధారపడి ఉంటుంది.జంతువుల విషయములో కూడా అవి ఏమి పొందుతున్నాయో నా ఇష్టముపై కాదు. కాని వాటి ప్రారబ్ధముపై ఆధారపడి ఉంటుంది.
కానీమనుష్యులవిషయములో
వారి ఇష్టము మేరకే వారు కోరింది ఇస్తాను.ఈ విధముగా మనుష్యులకు స్వేచ్ఛను ఏర్పాటు చేసాను.
అందువలన శ్రీ కృష్ణుడు వరము తీసుకొనేవాడు ఉంటేనే ఇచ్చేవాడు ఇస్తాడు అంటున్నాడు. నేను నాలుగు పురుషార్థాలు వాటిని సాధించే సాధనాలను మరియు స్వేచ్ఛను ఇచ్చాను. మరియు నేను భక్తుని కోరిక మేరకు వారి ప్రయత్నముకు అనుగుణముగా అనుగ్రహిస్తాను. కొందరు మాత్రమే మోక్షము పొందుతున్నారు అంటే ఆ కొందరే మోక్షముకై ప్రయత్నము చేస్తున్నారు అని అర్థము.
ఈ విధముగా శ్రీ కృష్ణుడు తాను పక్షపాతిని కానని తన నిష్పక్షపాతమును తెలియచేస్తున్నాడు.
తరవాత వేదాలలో ధర్మ అర్థ మోక్షా పురుషార్థాలకు కామ్య కర్మలు కర్మ మార్గము మోక్ష పురుషార్థముకు నిష్కామ నిత్య నైమిత్తిక కర్మలు మరియు జ్ఞానము జ్ఞానమార్గము అనే రెండు మార్గాలుఇవ్వబడ్డాయి.ఎవరైనా సకామ కర్మలను ఈ మూడు పురుషార్థాలకు
లేదా ఏ వ్యక్తి అయిన నిష్కామ కర్మను జ్ఞానము మోక్షము కోసము అనుసరించ వచ్చును.
ఎవరు ఏ మార్గములో నన్ను అనుసరిస్తారో వారిని ఆ మార్గములో అనుగ్రహిస్తాను.
యే యథా మాం ప్రపద్యంతే=ఎవరు నన్ను ఎట్లు సేవింతురో అహం =నేను తాన్=వారిని తథా ఏవ =అట్లే భజామి అనుగ్రహింతును.
భగవంతుణ్ణి ప్రార్థించటము అంటే వాచిక కర్మ మాత్రమే కాదు.వేదాలలో ప్రార్థన అంటే సరిఅయిన కర్మ చేయటము.ధర్మ అర్థ కామ పురుషార్థాలకు కామ్య కర్మాణి కర్మ అనుష్టానుము మోక్షముకు నిష్కామ
కర్మ మరియు శ్రవణ మనన నిధిధ్యాసముల ద్వారా జ్ఞానము జ్ఞాన అభ్యాసము అని అర్థము.
వేదాల ప్రకారము ప్రార్థన ఫలించడము అంటే కర్మ ఫలితము కలిగించింది అని అర్థము. కర్మ కర్మ ఫలమును జ్ఞానము జ్ఞాన ఫలమును కలిగిస్తాయి.
అందువలన శాస్త్రాలలో రెండు మార్గాలు కర్మఅభ్యాస జ్ఞానఅభ్యాస సూచించ బడ్డాయి.వేద భాషలో కర్మ అభ్యాసము జ్ఞాన అభ్యాసము రెండు కూడా ప్రార్థన(పూజ)తో సమానము.
ఈ రెండు మార్గాలను నేను వేదాలలో సూచించాను కనుక తగిన కర్మఫలము కూడా నేనే ఇస్తాను.
మమ వర్త్మ అంటే శాస్త్రీయ కర్మ జ్ఞాన
మార్గమును అనువర్తంతే అనుసరింతురు.
ఎవరైతే ఈ వైదిక మార్గములలో ఏ విధమైన కర్మ ఆచరిస్తారో వారికి దానికి తగిన కర్మ ఫలమును ఇచ్చుట నా ధర్మము.
అందువలన నేను వివిధ ఫలములకు బాధ్యుడిని కాదు. ఇది ఈ శ్లోకము యొక్క సారాంశము.
యే యథా మాం ప్రపద్యంతే తాం స్తథైవ భజామ్యహమ్
మమ వర్త్మనువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః
భగవద్గీత (4-11)
- ప్రవీణ్