వినాయక చవితి పూజకోసం ఇవి రెడీగా ఉంచుకోండి.
వినాయక చవితి పూజకోసం ఇవి రెడీగా ఉంచుకోండి.
వినాయక చవితి పూజకోసం మీరు సిద్ధం చేసి ఉంచుకోవాల్సిన సామాన్ల లిస్ట్ క్రింద ఇవ్వబడింది. ఇది మామూలుగా అందరు పూజకోసం ఉపయోగించేది. మీ మీ ఆనవాయితీల ప్రకారం ఇంకా ఏమైనా కావాలంటే కలుపుకోండి. చివరి నిమిషంలో హడావిడి పడకుండా మీ సౌలభ్యం కోసం ఈ లిస్ట్ ఇవ్వబడింది. హిందువులందరికి ముఖ్యంగా మన తెలుగు వారికి వినాయక చవితి ఎంత ప్రాధాన్యత ఉందొ తెలుసు కనుక, మీరు కంగారు పడకుండా, అన్ని అందుబాటులో ఉంచుకుంటారు అనే ఉద్దేశంతో ఈ చిన్ని ప్రయత్నం చేస్తున్నాము.
వినాయక ప్రతిమ 1
పసుపు 50గ్రా
కుంకుమ 50గ్రా
తమలపాకులు 25
వక్కలు 50గ్రా
కొబ్బరికాయలు 3
బియ్యం 2కేజీ
అరటిఆకు 1
అరటిపండ్లు 12
ఆపిల్ 3
జామకాయలు 3
విడిపూలు 20రూ
మూరపూలు 5 మూరలు
పాలు 1గ్లాసు
పెరుగు 1గ్లాసు
నెయ్యి 50గ్రా
తేనె 50గ్రా
చక్కర 100గ్రా
బెల్లం 50గ్రా
మామిడి ఆకులు
పత్రి ( 21 రకాల ఆకులు )
నువ్వులనూనె 100 గ్రా
వత్తులు
అగ్గిపెట్టె
పాలవెల్లి
గంధం డబ్బా 1
పళ్ళాలు 3
గ్లాసులు 2
చెంచాలు 2
దీపారాధన కుందులు 2
పీటలు 3
చాపలు
పంచపాత్ర 1
ఉద్ధరిణ 1
పళ్లెం 1
గంట 1
ఏక హారతి 1
పత్తితో వస్త్రం
పత్తితో యజ్నోపవీతం
గరిక పూజ కోసం గరిక
చలిమిడి
వడపప్పు
పానకం
కుడుములు
ఉండ్రాళ్ళు
చలిమిడి ఉండ్రాళ్ళు (పద్ధతి ఉన్నవాళ్ళకి)
ప్రసాదం
పులిహోర
పాయసం
గారెలు
బూరెలు
(పైన చెప్పిన ప్రసాదాలే చేయాలని లేదు. మీకు తోచినవి, వీలున్నవి చేసుకొనవచ్చును. ఉండ్రాళ్ళు మాత్రం తప్పనిసరిగా చేయాలి.
తోర పూజ వున్నవాళ్లు తోరాలు రెడీగా ఉంచుకోవాలి.