Online Puja Services

త్వరగా పెళ్లి కావాలంటే ఈ మంత్రాలు పఠించండి

3.148.171.222
అబ్బాయికైనా అమ్మాయికైనా త్వరగా పెళ్లి కావాలంటే ఈ మంత్రాలు పఠించండి 
 
మంత్ర తంత్రాలు మనిషి జీవితంలోని గ్రహదోషాలకు పరిష్కార మార్గాలు చూపిస్తాయని మన పురాణ సాహిత్యం చెబుతోంది. దేనికి ఏ మంత్రం పఠిస్తే ఎలాంటి పరిష్కార మార్గం లభిస్తుందో కూడా అవి వివరించాయి. ఆసక్తి, నమ్మకం ఉన్నావారు వాటిని పాటించి ఫలితాలు పొందొచ్చు.
అయితే మంత్రాలకు చింతకాయలు రాలతాయా అని విమర్శించేవారు వీటి జోలికి పోకపోవడం ఉత్తమం. విశ్వాసమే అన్నింటికీ పునాది. ఇక చాలా మంది వివాహ సమస్యతో బాధపడుతుంటారు. అలాంటి వారి కోసం కూడా మన పురాణాల్లో మంత్రాలు ఉన్నాయి.
 
త్వరగా పెళ్లి కావాలంటే.. ఈ క్రింది మంత్రాలు పఠించాలి.
 
1. కాత్యాయనీ మహాభాగే మహాయోగిన్‌ యతీశ్వరీ
నందగోప సుతం దేవీ పతిమే కురుతే నమః
 
2. అనాకలిత సాదృశ్య చుబుక విరాజితః
కామేశ బద్ద మాంగల్య సూత్ర శోభిత కందర
 
3. విదేహి కళ్యాణం విదేహీ పరమాశ్రయం
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజమే
 
4 సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్రయంబకే దేవీ నారాయణే నమోస్తుతే
 
రుక్మిణీ కల్యాణం పారాయణం చేయటం కూడా సత్వర వివాహానికి ఉపకరిస్తుంది. అలాగే.. పెళ్లికాని కన్యలు నిత్యం స్నానానంతరం తులసి చెట్టుకు 12 ప్రదక్షిణాలు చేసి గౌరీమాతను ప్రార్థిస్తూ సౌందర్యలహరిలోని 4, 11, 27 శ్లోకాలలో ఏదో ఒకదాన్ని పఠించాలి. ఇలా 120 రోజులు చేస్తే త్వరగా వివాహమవుతుంది. 
 
అమ్మ అందరిని చల్లగా చూడమ్మా 
 
- బి. సునీత శివయ్య 

Quote of the day

As a single withered tree, if set aflame, causes a whole forest to burn, so does a rascal son destroy a whole family.…

__________Chanakya