అరిటాకు లో ఎటు వైపునుంచి వడ్డించాలి?
అరిటాకు గురించి తెలుసుకుందామా
మొదట్లో అరిటాకు మధ్యలో ఆ గీతాలా ఉండేది కాదంట.
ఒకరోజు విందులో ఆ శ్రీరాముడు హనుమంతుడు ఒకే అరిటాకులో బోంచేయాల్సిన వేళ శ్రీరాముడు ఆకులో సగానికి అలా గీత గీసారంట.
రామయ్య హనుమయ్య ఎదురెదురుగా కూర్చుని భుజించ ప్రారంభించారు రామయ్య వైపు ఉన్న ఆకులో మానవులం తినే ఆహారాన్ని ఉంచగా హనుమయ్య వైపు వానరాలు తినే ఆహారాన్ని అని ఉంచడం జరిగిందంట. అప్పటి నుండి అరిటాకులో అలా గీత రావడం మొదలైందంట.
అందరికి అనుమానం అరిటాకు తినేవారి ముందు ఎటువైపు ఉంచి వడ్డించాలి అని..
కూర్చున్న వారి ఎడమవైపున చిన్నదైన మూల భాగమును వెడల్పైన భాగాన్ని కుడివైపున ఉండాలంట. మనం కుడిచేతితో కలుపుకుని తినాలి కనుక అటువైపు విశాల భాగం ఉండాలని పెద్దలు చెప్పారు.
ఆకులో మొదట వడ్డించిన విస్తరిలో తీపి తినాలని ఎందుకు అంటారు?
ఎడమవైపు పైభాగాన తీపు పళ్ళు అన్ని వడ్డిస్తారు. ఆహారానికి ముందు తీపి తీసుకోవడం వల్ల మన జీర్ణవ్యవస్థ చురుకుగా మొదలై మనం తీసుకునే ఆహరం బాగా జీర్ణం అవుతుందని తీపిని మొదట తినమంటారు. ఇలా ఎన్నో ఉపయోగాలు ఉండడం వల్లనే మన పెద్దలు ఎటువంటి శుభ అశుభ కార్యక్రమాలకు ఈ అరిటాకులనే వాడేవారు.
మన ఇంటికి వచ్చిన అతిథి ఆరోగ్యంతో ఉండాలనే ఆలోచన వల్ల కానీ ఆ సంప్రదాయాన్ని మరిచి ప్లాస్టిక్ ఆకులు ప్లాస్టిక్ ప్రేమలు ఎక్కువయ్యాయి ఇప్పటికైనా మారుదాం.
సంప్రదాయాలను పాటించి ఆరోగ్యంగా జీవిద్దాం
- సేకరణ: నాగమణి