శ్రీ గురుడు తెలిపిన శిష్య ధర్మాలు
శ్రీ గురు చరిత్ర లో శ్రీ గురుడు తెలిపిన శిష్య ధర్మాలు
గురు ద్రోహము చేయుట,
గురువును చులకనగా చూచుట,
గురువు వద్ద నటించుట,
గురువుకంటే తనకే ఎక్కువ తెలియునని భావించుట,
గురువు చెప్పిన పనికి విరుద్ధముగా చేయుట,
గురువు వద్ద వినయము నటించుచు బాహ్యములో గురువు చెప్పిన విషయములను విమర్శించుట,
తాను బాహ్యములో చేయు పనులు గురువుకు తెలియవుకదా అని భావించుట
గురువును సాధారణ మానవునిగా తలుచుట,
గురువులతో వాధించుట,
ఉపదేశం పొందిన మంత్రాన్ని వీడుట
గురువు కన్నా ఎత్తులో కుర్చుండుట,
గురు శిష్యులు ఒకే చోట ఉన్నప్పుడు గురువు కన్నా ముందే భుజించుట-
ఇత్యాది స్థితులు శిష్యుని ఎన్ని జన్మలకైను నిజమైన ఆత్మస్థితికి చేరనీయవు.
జై గురు దత్త
- శ్రీకాంత్ శర్మ