దత్తాత్రేయ అవతారంలో రహస్యం
శ్రీ గురుభ్యోనమః
* అత్రి మహర్షి పత్ని అనసూయ మాత త్రిమూర్తులను
పుత్రులుగా కోరగా త్రిమూర్తులు శ్రీ దత్త అవతారం తీసుకొన్నారు అని మన అందరికి తెలిసిన వృత్తాంతము.
* అనసూయ మాత కోరిక కోసమే శ్రీ దత్త అవతారం జరిగిందా? లేక శ్రీ దత్త అవతారంకు మరేదేమై కారణం ఉందా?
* త్రిమూర్తులను పుత్రులుగా గా కోరినపుడు వారు ముగ్గురు గా జన్మిచినారా ? ముగ్గురిగా జన్మించి తరువాత మూడు శిరస్సు లతో దత్తడి గా ప్రకటితమైనారా?
ఇది నా విశ్లేషణ...
శ్రీ దత్త అవతారం తీసుకొనే దానిలో నాకు అనిపిస్తున్నది
శ్రీ మహా విష్ణువు లేక శ్రీ శంకర భగవానుల అద్భుతమైన లీలా వినోదం ఉంది అనిపిస్తుంది.
లింగోద్భవ సమయంలో లింగ ఆగ్ర భాగం చూసినాని బ్రహ్మ దేవుడు అపద్దం చెప్పినాడు అని ఆగ్రహించిన పరమేశ్వరుడు బ్రహ్మ దేవునికి పూజ లే వుండవు అని శపించిన విషయం మనకు విదితమే.
ఎదిరించి పోరాడిన పుత్రుడినే కరుణించిన శంకరుడు
దక్షప్రజాపతి అంతటోడినే క్షమించిన శంకరుడు,
మన్మధుడి ని బూడిద చేసి కరుణించిన శంకరుడు,
పరమ క్రూరులైన అసురులనే కటాక్షించిన భోళ్లా శంకరుడు....
ఇక్కడ గమనించి వలసిన విషయం పరమశివుడు
శపించినా, శిక్షించినా వారిని తిరిగి ఉద్ధరించనప్పుడు గమనిస్తే ..
తన పుత్రుడి తలే నరికి భస్మం చేసి గజ ముఖంతో పునర్జీవితుడిని చేసినాడు.
దక్షప్రజాపతి తల నరికి శిక్షించినా తిరిగి అదే తల పెట్టగల శక్తి వున్నా మేక తల పెట్టడం జరిగింది.
అలాగే మన్మధుడిని భస్మం చేసినా తిరిగి ఛాయా రూపుడిగానే పునర్జీవితుడిని చేసిన కృప సాగారుడు.
అనంగుడిగా (అంగాలు లేకుండా) పునర్జీవితుడిని చేసినట్లు గుడా చెబుతారు.
పైన చెప్పిన వన్నీ శిక్షలే, బ్రహ్మ కు కేవలం శాపం మాత్రమే, శిక్షలేనే కరుణించిన ఆ దేవదేవునికి, ఇచ్చిన శాపంను అనుగ్రహంగా మార్చలేడా చెప్పండి.
పరమేశ్వరుడు బ్రహ్మ కు శాపం అయితే ఇచ్చేసినాడు.
అయితే త్రిమూర్తుల మద్య బేధం ఉండరాదని
తిరిగీ బ్రహ్మ కు పూజా అర్హత ఎలా అని జగన్మాతలచే అనసూయ మాత ను పరీక్షించే నెపం సాకుగా చూపి. అనసూయ మాత త్రిమూర్తులకు తల్లి కావాలన్న చిరకాల కోరికను వరంగా ఇస్తూ త్రిమూర్తులు శ్రీ దత్త అవతార అవతరణ జరిగింది, శ్రీ దత్తు ల వారిని పూజించిన , పరమశివుడు తాను ఇచ్చిన శాపం భంగం కాకుండా, త్రిమూర్త రూపంగా బ్రహ్మ దేవునికి పుజాలు అందుకునేట్లు అనుగ్రహించాడు ఆ సదాశివుడు.
-
సుధాకర్ లక్కవరం