మంత్ర శాస్త్ర ప్రకారం తులసీ మాత మూల మంత్రములు
మంత్ర శాస్త్రాలు అన్నిటిలోనూఅష్ట బిల్వాలు గా వ్యవహరించబడే 8 గొప్ప ఔషధాలలో తులసి మాత కి మొదటి స్థానాన్ని ఇచ్చారు.
మరి ఆ అష్ట బిల్వాలు ఏమిటో తెలుసా...
1 తులసి
2 మారేడు
3 వావిలి
4 ఉత్తరేణి
5 వెలగ
6 జమ్మి
7 ఉసిరి
8 గరిక
ఈ అష్ట బిల్వాలను/మూలికలను,,, కర్మ మూలికలు అని కూడా అంటారు. వీటిలో గొప్పది తులసి మాత. మరి అటువంటి తులసి మాత మూల మంత్రం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
తులసి మాత మూలమంత్రం
ఓం శ్రీం హ్రీం క్లీం ఐం బృందావన్యై స్వాహా||
తులసి చెట్టు చుట్టూ మూడు సార్లు ప్రదక్షణ చేసిన తరువాత ఈ మూల మంత్రాన్ని తులసిమాల తోటి 108 మార్లు జపించాలి. ఈ విధంగా రోజూ చేస్తూ ఉన్నట్లయితే ఎంతటి క్లిష్ట కార్యమైనా 108 రోజులలోగా సిద్ధించగలదని మంత్ర శాస్త్ర ప్రమాణం ఉంది.....
స్త్రీలు కూడా అశుచి దినములు(5 రోజులు) మినహాయించి పూజ చేసుకొనవచ్చును..
శ్రీ రాముని సన్నిధి,, మౌనవ్రతం,, మంత్రార్ధమును నిరంతరము చింతించడం,, తులసి మారేడు పారిజాతం వీటి మొదట్లో గల స్థలం,, తామర పూస,, రుద్రాక్ష,, తులసి కాడ మాల జపమాలు గా కలిగి ఉండటం,, ఇవన్నీ మంత్రసిద్ధి అనుకూల మైనటువంటి ప్రదేశాలు మరియు వస్తువులు....
శ్రీ తులసీ యక్షిణి మంత్రం
మూలమంత్రం ----- ఓం క్లీం క్లీం నమః
దత్తాత్రేయ తంత్రం ప్రకారం పైన చెప్పబడిన మూలమంత్రాన్ని శ్రద్ధతో, భక్తితో,,నమ్మకముతో,, బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ,, అసత్యము పలుకకుండా సత్య పరులై,, శాఖాహారులై,, సాధ్యమైనంత వరకు మౌనాన్ని పాటిస్తూ,, రోజుకు 5000 సంఖ్యతో 41 రోజులు జపం చేస్తే తులసి దేవత ప్రత్యక్షమై, రాజ్య ప్రాప్తి తో సహా కోరిన వరాలను ఇస్తుంది అని శాస్త్ర ప్రమాణం..
- ప్రవీణ్