శబరిగిరి లో నిత్యాగ్నిహోత్రం నిర్వహించబడుతుంద.?
స్వామి శరణం
వానప్రస్థాశ్రమం లో నిత్యాగ్నిహోత్రం ఏ విధంగా జరుగుతుందో అదే విధంగా శబరిగిరి ఆలయం తెరిచి ఉన్నంతవరకూ గణపతి హోమం అగ్ని గుండంలో అగ్ని రగులుతూ అగ్నిహోత్రాన్ని తలపిస్తూ ఉంటుంది.వానప్రస్తం లో : ఇదo నామామ : బుద్ధితో నిత్యం యజ్ఞం నిర్వహించబడుతుంది .
(ఇదo నామామఅంటే "ఇది నాది కాదు" అనే భావన)
ఇది నాది కాదు (ఇదo నామామ) అనే భావనను శబరిగిరి లో ఎక్కడ గమనించవచ్చు తెలుసుకుందాం.
*నేతి కొబ్బరి కాయ కు చెందిన కొబ్బరి చిప్పలను అగ్నిగుండంలో వేసేటప్పుడు ఆ భక్తులలో(ఇదo నామామ) ఇది నాది కాదు అనే భావమే ఉంటుంది. కనుక ఇదo నమామ అనే భావనను శబరిగిరి లో భక్తుల లో చూడవచ్చును.
వానప్రస్థాశ్రమం లో యజ్ఞ ద్రవ్యంగా సమితులను ఆవునెయ్యిని నిత్యాగ్నిహోత్రంలో వేసి 'ఏదoనమామ' అనే త్యాగ భావాన్ని కలిగి ఉంటారు.. ( శబరిమలైలో భక్తులు సమర్పించిన ఏ విధమైన ద్రవ్యాన్ని ధర్మశాస్తా తన వద్ద ఉంచుకోవడం లేదు ఇది కూడా "ఇదoనమ" అనడానికి సంకేతమే). స్వామి శరణం
ఎల్.రాజేశ్వర్