వివేకం అంటే ఏంటి ?
నా స్టూడెంట్ ఒక ప్రశ్న వేసింది..
సార్.. వివేకం అంటే ఏంటి ? అని ..
ఎప్పుడూ వినే పదమే..
ఎలా !
ఏది మంచి ? ఏది చెడు అనే ఆలోచన కలిగి ఉండటమే ! అన్నాను.. ఇంకా చెప్పాలంటే హంస పాలను నీటినుండి వేరుచేసినట్లు , చెడునుండి మంచిని వేరు చేయడమే ! అన్నాను ..
జ్యూదం మంచిది కాదు , అని దుర్యోధనునికి తెలుసు .. అందుకే తాను ఆడకుండా శకుని చేత ఆడించాడు.. ఈ విషయంలో రారాజు వివేకాన్ని ప్రదర్శించాడు .. ధర్మరాజుని రెచ్చగొట్టాడు .. ఓడించాడు ..
ధర్మరాజుకి జ్యూదవ్యసనం ఉంది. రాజు వ్యసన పరుడై ఉండకూడదు . ఆ సమయంలో వివేకాన్ని కోల్పోయాడు. సర్వం పోగొట్టుకున్నాడు. చివరికి ద్రౌపది తన ఒక్కడికే భార్య కాదు అని తెలిసినా వివేక శూన్యుడై ద్రౌపదిని కూడా పణంగా పెట్టి భ్రష్ఠుడై పోయాడు..
మనిషి ఆవేశంలో ఉన్నప్పుడు వివేకాన్ని కోల్పోయి చెయ్యకూడని తప్పులు చేస్తాడు ..
మన చుట్టూ కూడా కొంతమంది ఉంటారు.. మేధావులే ! కానీ వివేకాన్ని కోల్పోవడం ద్వారానే వీధిలో పడతారు .. ఛీవాట్లు తింటారు .. గౌరవాన్ని పోగొట్టుకుంటారు ..
ఒక్క మాటలో చెప్పాలంటే ఎదుటివారు రెచ్చగొడుతున్నా రెచ్చిపోకుండా , విజ్ఞతను ప్రదర్శించడమే వివేకమంటే అన్నాను..
ఓహో ! Cleverness అని simple గా కూడా చెప్పొచ్చేమో కదా సార్ అంటూ వెళ్ళిపోయింది ..
ఔరా !ఎంత తెలివైంది !ఈ అమ్మాయి అనుకున్నా..
వందనములతో..
V. Somavajhala..