Online Puja Services

శబరిమల

18.221.20.252
హరి హర పుత్రుడు శ్రీ ధర్మశాస్తా కథలు నo 21
  
 
 
ఈ నాటి శాస్త కథలలో మనం కుండలిని శక్తికి సంభందించిన ఆరు కోవెలలో ఆరవది, పంచ శాస్తా ఆలయాలలో ఆఖరుది అయిన అతి ఉత్క్రుష్టమైన శ్రీ ధర్మ శాస్తా శబరిమల ఆలయo    గురించి క్లుప్తంగా తెలుసుకుందాం.
 
     ఈ ఆలయం గురించి తెలియని స్వామి భక్తులు ఇలలో లేరని  నిస్సoదేహముగా చెప్పవచ్చును. 
 
    ఈ మల (కొండ) కైవల్యం పొందిన శబరి మాత పేరిట వెలసిన ఆలయపు కొండ. నైష్ఠిక బ్రహ్మచారి యైన శ్రీధర్మ శాస్తాను దేవలోకమునుండి ఆహ్వానించి, పిలుచుకొని వచ్చినపుడు, ఆయన  పొంనంబలేడు లో  శ్రీ ధర్మశాస్తాగా స్వంభువు గా వెలసిన పిదప, పరశురాముడు తన స్వస్థలమైన పరశురామ క్షేత్రమున (కేరళ) 108 శాస్త ఆలయములు నిర్మింప, షట్చక్రములకు నిలయమైనవి ఇంతవరకు మనం తెలుసుకొన్న ఆరు ఆలయాలలో అత్యధిక ప్రాధాన్యత కలిగిన ఆలయాల లోనిదే ఈ శబరిమల శ్రీధర్మశాస్తా ఆలయం. ఇవ్విధముగా ఆరాజకములు ప్రభలిన పరశురామ క్షేత్రమున, ధర్మ సంరక్షణార్థమై శ్వామి వారు వెలసి, ధర్మాన్ని రక్షించి, భక్తులకు షట్చక్రములకు ప్రేరణ కలిగించి, ముక్తి మార్గమును చూపుతూ ఇక్కడ ప్రసిద్ధి పొందారు.ఇచ్చటనే నిజ భక్తులకు ఆజ్ఞా చక్రము ప్రేరితము కాగలదు.
 
        కాలక్రమాన ఈ ఆలయము పూజారి మనముడు, పందలరాజ వంశజుడు అయిన శాస్తా అవతార పురుషుడు, ఇందులీనమగునపుడు, అప్పటి పందల రాజు, రాణి  - భక్తి ప్రవృత్తులతో, ప్రేమ అనురాగముల మిళితమైన ఉత్సుకతో ఒకరు అయ్యా ! అని మరొకరు అప్పా అని ఆర్తితో పిలవడం వలన స్వామికి అయ్యప్ప అను పేరు చిరస్థాయిగా నిలబడి పోయినది. 18 మెట్లపై దేద్వీప మానంగా అయ్యప్ప గా, ...   పొంన్నంబల మేడులో  మకర సంక్రమణ దినమున జ్యోతి రూపముతోను భక్తుల కనులకు విందు చేయుచు, వారి కోర్కెలను మన్నిస్తూ స్వామి వెలసి యున్నారు.
 
 స్వామియే శరణo అయ్యప్పా! 

Quote of the day

The life ahead can only be glorious if you learn to live in total harmony with the Lord.…

__________Sai Baba