ఏరిమెలి
హరి హర పుత్రుడు శ్రీ ధర్మశాస్తా కథలు నo 20
ఈ నాటి శాస్త కథలలో మనం కుండలిని శక్తికి సంభందించిన ఆరు కోవెలలో ఐదవది , పంచ శాస్తా ఆలయాలలో నాలుగవది. దీని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. అదియే ఏరీమేలి శ్రీ ధర్మ శాస్తా ఆలయం. "శ్రీ భూత నాధో పాఖ్యానం" లో వర్ణింప బడిన మహిషి "మారికా వనము" అని ప్రస్తావిoప బడిన స్థలము అని చెప్పబడుతున్నది. ఈ క్షేత్రము విశుద్ధ చక్ర ప్రేరిత క్షేత్రము.
ఏరిమెలి ని దర్శించని భక్తుడు లేదనుటలో ఏ మాత్రము సందేహము లేదు. భక్తి, వినోదం, వయో భావములను మరపింప చేయునది, తారతమ్య ములను, స్థితి గతులను సమూలంగా క్షీణింప చేయునది, అందరము సమానమని వైరాగ్య భావమును భక్తుల మదిలో మొలిపింప చేయునది ఈ క్షేత్రము. జాతి మత కుల భేదముల ప్రసక్తి కాయే కాన రానిది ఈ ఒక్క క్షేత్రములో మాత్రము. ఆలయము అయినా , మసీదైన ఒక్కటే అన్న భావన స్పురింప చేయునదేయే ఏరిమెలి .
ఇచట రెండు ఆలయములు కలవు. పెట్టై ధర్మశాస్తా (కొచ్చoబలం) ఆలయము, ఏరిమెలి శ్రీ ధర్మ శాస్తా ఆలయం, దీనినే వలయంబలం ( పెద్ద ఆలయము) అని కూడా అంటారు. కొచ్చoబలం ఎదురుగా వావరు మసీదు ఉంటుంది. భక్తులు విభూతి ప్రసాదం ఇక్కడ ముస్లింల వద్ద తీసుకొంటారు.
కొచ్చoబలం లోని శాస్తా పోరాట వీరుడి లా ఉంటాడు. విజయంబలం శాస్తా పెట్టై తుళ్లల్ అలంకారముతో నుంటారు.
ఈ పెట్టాయి తుల్లల్, సంవత్సరంలో నవంబర్ నెల నుండి జనవరి నెల వరకు మాత్రమే చేస్తారు.
పురాణ గాథల అనుసారం, మహిషిని శాస్త్తా వారు సహరించిన సందర్భాన్ని గుర్తుకు తెస్తుంది. ఇచ్చట, అప్పటి ఆటవీకుల మహిషి భాధ తీరిన సందర్భాన్ని పురస్కరించుకొని, సంతోషముతో ఆడి, పాడి, గట్టి గట్టిగా స్వామి ని స్తుతించుతూ వేడుక చేసుకొనినారట.
ఇచ్చట సాంప్రదాయ ఆటవిక నృత్యం పేర్కొన వలసిన ముఖ్య విధి. భక్తులు తరతమ్యాలు మరచి, రంగులు పులుముకొని సంతోషంబున తనువులు పులికించి, అలసి పోవు వరకు గుంపులు గుంపులుగా నృత్యం చేస్తారు.
ఇక్కడ భక్తులకు విశుద్ధి చక్రం ప్రేరితము అవుతుంది.
ఏరిమెలి అరణ్య మార్గమునకు ప్రారంభ స్థలము. ఈ యాత్ర నే మనం పెద్ద పాద అని అంటాము. ఇక్కడనుండి దాదాపు సుమారు 60 కి.మీ దూరము శబరిమల. ఈ అరణ్య మార్గమునే స్వామి మహిషిని చంపటానికి వెళ్లిన దారి అని అంటారు.
ఈ నడక ప్రయణo భక్తులకు ఒక పవిత్రమైన భక్తి భావం ఉదయించగా చేస్తారు. స్వామి మొట్ట మొదటి మజిలీ చేసినది పేరూర్ తోడు అనే స్థలం. దీనిని దాటి వెళ్ళాలి. అటు పిదప పుంగావనం, కాలైకట్టి, అళుదానది, కరిమల ఇత్యాది పవిత్ర స్థలాలు దాటితేనే పవిత్ర గoగానదికి సమానమైన పంబ నది చేరగలము.
ఇట్లు
భవదీయుడు
L. రాజేశ్వర్