పల్లవుల గడియారం
నేను పరమాచార్య స్వామివారిని చిన్నప్పటినుండి దర్శించుకుంటున్నాను. చదువు పూర్తిచేసుకుని ఆర్కియాలజిస్ట్ అయిన తరువాత ఒకసారి స్వామివారి దర్శనానికి వెళ్ళాను. స్వామివారు నన్ను “నీ వృత్తి ఏమిటి?” అని అడిగారు.
మన దేవాలయాలలో పురావస్తు అధ్యయనాలు చేస్తుంటాము.
“ఎప్పుడైనా మహాబలిపురం వెళ్ళావా? అక్కడ ఏమి పరిశీలించావో నాకు చెప్పు?” అని అడిగారు.
”పాండవుల రథం, మహిశాసురమర్ధిని మొదలైనవి చూశాను” అని బదులిచ్చాను.
”అక్కడ పల్లవుల గడియారం కూడా ఉంది. నువ్వు చూశావా అక్కడ?”
స్వామివారు నాతో పరాచికమాడుతున్నారు అనుకొని ఇలా అడిగాను, “పెరియవ ఆకాలంలో పల్లవులవద్ద గడియారాలు ఎక్కడివి?”
“ఉన్నాయి. అక్కడ ఉంది... ఉంది... మరలా అక్కడికి వెళ్ళినప్పుడు చూడటానికి ప్రయత్నించు” అని దృఢంగా చెప్పారు. మరలా వారి దర్శనానికి వెళ్ళినప్పుడు నన్ను అడిగారు “గడియారం చూశావా?” అని.
”లేదు పెరియవ ఎక్కడ చూడాలో నాకు తెలియలేదు” అని చెప్పాను. ”అర్జున తపస్సు చూశావా?”
“చూశాను”
“ఆ అర్జున తపస్సు శిల్పం కిందనే ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది. నదికి దగ్గర్లో ఒక ఋషి కూర్చుని ఉంటాడు. దాని కిందనే కొంతమంది కూర్చుని వేదం చదువుతుంటారు. ఒక వ్యక్తి బట్టలను పిండుతుంటాడు. ఇంకొక వ్యక్తి మధ్యాహ్నికం (మధ్యాహ్న సంధ్యావందనం) చేస్తుంటాడు. మరొక వ్యక్తి మధ్యాహ్నికంలో భాగంగా రెండు చేతుల యొక్క వేళ్ళ సందులోనుండి సూర్యుణ్ణి చూస్తుంటాడు. శిల్పి ఏం చెప్పదల్చుకున్నాడంటే అప్పుడు సమయం మద్యాహ్నం 12 గంటలు అని ఎందుకంటే ఆ సమయప్పుడే మధ్యాహ్నికం చేసేది. అందుకే నేను దాన్ని పల్లవుల గడియారం అని అన్నాను”
ఇది విని నేని నిచ్చేష్టుణ్ణి అయ్యాను. శంకరా! ఏమి పరమాచార్య స్వామివారి అసాధారణ పరిశీలనా దృష్టి. శంకరా! ఎవరి వీరు? ఏమిటి వీరు?
--- డా. సత్యమూర్తి, ప్రఖ్యాత ఆర్కియాలజిస్ట్