గ్రామ దేవతలు జంతు బలి ఎందుకు కోరుకుంటారు,
గ్రామ దేవతలు జంతు బలి ఎందుకు కోరుకుంటారు, దయ్యాలు భూతాలను ఉరి పొలిమేర దాటనీయ కుండా ఎవరు కాపాడుతారు ?
అవును ఈ దయ్యాలు భూతాలు, ఉరి పైన పడి ప్రజలకు హాని కలిగించే విధంగా నానా రకాల జబ్బులు ,కలరా, మసూచికలు ఇలా ఎన్నో రకాల అర్తం కానీ జబ్బుతో ప్రజలను చంపుకు తింటాయి అని నమ్మకం...... మరి ఈ భూతాల భారి నుండి ప్రజలను ఊరిని కాపాడటం కోసం ప్రతి గ్రామం లోను పార్వతి దేవి గ్రామదేవతగా వెలసి ఊరిని రక్షిస్తుంది.
మరి ఆ తల్లి గ్రామ ప్రజలను ఎలా కాపాడుతుంది, ఆ భూతాల ఆకాలి ఎలా తెరుస్తుంది తెలుసుకుందాము.
గ్రామ దేవతలకు చేసే పూజ విధానం "వామాచారం" వమాచారం కూడా శ్రీవిద్యలో శాస్త్ర సమ్మతమైన విధానం.
ఆ తల్లి జగన్మాత భూతనాయకి కూడా, ప్రజలకే కాదు సకల సృష్టికి తల్లి ,ఆ భూతాలు ప్రేతాలు కూడా ఆ తల్లిని ని వేడుకుంటాయి. వమాచారం విధానం లో తాంత్రిక విధానంలో పూజలు జరితున్న దేవాలయం ఉన్న అమ్మవారు అక్కడ పూజలు సక్రమంగా జరుగుతున్నoత కాలం అక్కడ ప్రజలను పట్టి పీడించకుండా ఆ తల్లి అక్కడే కొలువై ఉండి ఊరిని ప్రజలను రక్షిస్తుంది.
ఆ భూతాలకు కూడా ఆకలి తీర్చడం కోసం అక్కడ జంతు బలి ఇస్తారు, జాతర జరిపి కుంభం వేస్తారు, ఆ కుంభంలో, పిండి తలుగు, పొంగలి అన్నం, అంబలి, వడలు, మాంసపు,చేపలు వంటి వాటితో పులుసు ఇలాంటి వన్ని కుంభంలో ఉరి ప్రజలు సమర్పిస్తారు..అక్కడ ఇచ్చిన జంతుబలి రక్తం పడిన వెంటనే పేల్చుకుంటాయి ,మనము కుంభంగా సమర్పించే ఆహారాన్ని ఆ భూతాలు ఆహారంగా స్వీకరిస్తాయి..
అక్కడ బలి ఇచ్చిన మాంసాన్ని గర్భ గుడి లోకి అనుమతించరు.. ప్రతి గ్రామ దేవత గుడి కి బలికోసం ఒక ప్రత్యేకత ప్రాంతం ఉంచుతారు అక్కడ మటుకే బలి ఇవ్వడం జరుగుతుంది కానీ, ఆ బలి రక్తం అమ్మవారు ఆహారంగా స్వీకరించరు...
భూతలకు కూడా తల్లి కాబట్టి వాటి ఆకలి తీర్చి ఉరి ప్రజల ద్వారా ఆహారం వాటికి పెట్టించి ఊరి ప్రజలను పట్టి పీడించ కుండా వాటిని తొక్కి పెడతారు గ్రామ దేవతలు...
కొంతమంది బలి ఎందుకు ఇస్తారో తెలియక గ్రామ దేవతలు మాంసం స్వీకరిస్తారు ,హిందువులు బలులు ఇస్తారని నోటికి వచ్చినట్టు విమర్శిస్తున్నారు.... బలి ఇచ్చేది దుష్ట శక్తులను శాంత పరచి ఊరిని కాపాడటానికి అని సమాధానం చెప్పండి
సనాతన ధర్మ ( హైందవ ) ఆచారాలలో కొంతమంది దేవతలకు జంతు బలులు సమర్పిస్తారు... కొన్ని సంప్రదాయాలలో తమ కోరికలు నెరవేర్చుకోవడాని కానీ మొక్కుబడిగా కానీ జంతు బలులు ఇచ్చే ఆచారం ఉన్నది. కానీ సనాతన ధర్మం లోని అన్ని విషయాలు మనుష్యుల మరియు ఇతర ప్రాణుల యొక్క హితం కోసం చెప్పబడ్డాయి. లోకమంతా సుఖంగా ఉండాలీ అన్న సనాతన ధర్మం , దానికి మూలం ఐన ఆ భగవంతుడూ ఒకరి కోరికలు తీర్చడానికి ఇంకొక ప్రాణాన్ని బలి కోరతాడా?............సనాతన ధర్మంలో భూతబలి అనే ఆచారం స్పష్టంగా చెప్పబడింది. ప్రజలు తాము ఇంటిలో వండిన అన్నమును కానీ ఇతర పదార్థమును కానీ గుడిలో వివిధ దిక్కులలో కానీ బలి పీఠం వద్ద కానీ ఉంచుతారు. వాటిని జంతువులూ ప్రకృతిలోని ఉగ్ర భూతములూ తింటాయి. ఇది గృహస్తులు కూడా ఇంటివద్ద చేయాల్సిన పనిగా చెప్పబడింది. ఐతే బలికి హోమానికి తేడా ఉన్నది హోమం అగ్ని ద్వారా ఇస్తారు. ప్రకృతిలోని ఇతర ప్రాణులకూ కూడా ఆహారం అందించే మంచి ఉద్దేశ్యముతో ఇది చెప్పబడినది.
శ్రీ విద్య మొదలైన సంప్రదాయాలలో జంతు బలుల ప్రస్థావన ఉన్నది. అవి దేవతలకు ఒక పొట్టేలునో మేకపోతునో నల్లపిల్లినో దున్నపోతునో బలి ఇవ్వమని చెప్పాయి. ఐతే దాని అర్థం ఒక అమాయకమైన జంతువును దేవుడి పేరు చెప్పి అన్యాయంగా హత్య చేయమని కాదు.. ప్రజలు దుష్ట గ్రహాలకు బలి కాకుండా కాపాడ టానికే...
- భానుమతి అక్కిశెట్టి