సొరి ముత్తయ్యన్ కోవిల్
హరి హర పుత్రుడు శ్రీ ధర్మశాస్తా కథలు
ఈ మహా శాస్త కథలలో ఈ రోజునుండి ప్రఖ్యాతి గాంచిన ఆరు మహశాస్తాల యొక్క ఆలయాల గురించి, ప్రతి రోజు వివరించెదను. మొదటది సొరి ముత్తయ్యన్ కోవిల్ పిదప పంచశాస్తా ఆలయాలయిన ......
1. అచ్చన్ కోవిల్, 2.ఆర్యన్ కావు, 3.కులత్తుపుళ 4.ఏరిమెలి.5.శబరిమల.
ఈ ఆరు శాస్త ఆలయాలు, ఆరు పడై వీడు సుబ్రహ్మణ్యస్వామి ఆలయాల మాదిరిగానే, మనలోని కుండలిని శక్తులను ఉత్తేజము చేయు దివ్యమైన ఆలయాలు. ప్రతి భక్తుడు శబరిమల లోని ఆలయమును సందర్శించుకోనుటకు మునుపు ఈ అయిదు ఆలయాలను సందర్శించిన పిదపనే శబరిమల ఆలయము చేరవలెను. ఎలన కుండలిని శక్తిని ఒక వరుస క్రమమున మాత్రమే ఉత్తేజము చేయతగును. మూలాధార చక్రమునుండి అజ్ఞాచక్రమునకు, వరుసగా వెళ్లవలెను.
1.సొరి ముత్తయ్యన్ కోవిల్ (మూలాధారం చక్రం)
ఈ క్షేత్రం తమిళనాడు లోని తిరునల్వేలి జిల్లాలోనే పొదిగై కొండపైన నున్నది. దిగువున తామ్రపర్ని నది ప్రవహించుచుoడును. మూల - ఆది మూల ఆయాలయమంటారు. స్వామిని ఆది భూతనాథుడు అని అంటారు. సమస్త భూత గణాలను తన అదుపాజ్ఞలలో నుంచువాడంటారు.
ఈ ఆలయసందర్శనం మూలాధారం ను ఉత్తేజము చేయునని ఆర్యుల వాక్కు. స్వామి తన ఇరువైపులా పూర్ణకళ, మరియు పుష్కళా సమేతముగా దర్శనం ఇస్తారు.
ఈ ఆలయ దర్శనం తరువాతనే స్వాధిష్టాన, మణిపూరక,అనాహత, విశుద్ధి చక్రాల కు సంకేతాలు అయిన అచ్చంకోవిల్, ఆర్యoకావు, కులత్తుపుళ, ఏరిమెలి దేవాలయాలను దర్శించాలి అని ఈ ఆలయ పూజారులు చెబుతారు. షట్చక్ర ఆలయాలుగా పేర్కొన్నారు.
ఈ ఆలయము ప్రవేశమున చాలా నెమళ్లు మనకు స్వాగతం పలుకుతాయి. ఈ ఆలయ ప్రాంగణమున ధ్యానం చేయుట వలన మన శరీరంలోని మూలాధారం చేతనా స్థితికి వచ్చునట. ధ్యానం చేయువారికి ఉదరమున ఒక విధమైన కదలిక (ప్రకంపన) భావము గోచరించునట.
ఈ ఆలయము అగస్త్యుడు చే ప్రతిష్టించబడగా, మిగతావన్నీ పరశురామ ప్రతిష్ట అని చరిత్రకారుల అభిప్రాయము.
ఈ ఆలయ సందర్శనం కుండిలిని లోని శక్తిని ప్రేరెపింప బడును అని ఈ ఆలయ పూజారులు అంటారు..
ఇట్లు
భవదీయుడు
L. రాజేశ్వర్