Online Puja Services

మహావైద్య శాస్తా

18.222.127.68
హరి హర పుత్రుడు శ్రీ ధర్మశాస్తా కథలు
 
 
 
ఈ మహా శాస్త కథలలో  నిన్నటి రోజు నుండి ప్రఖ్యాతి గాంచిన ఆరు మహశాస్తాల యొక్క  ఆలయాల గురించి వివరిస్తున్నాను. మొదటది సొరి ముత్తయ్యన్ కోవిల్.  మరియు  పంచశాస్తా ఆలయాలయిన ......

1. అచ్చన్ కోవిల్, 2.ఆర్యన్ కావు, 3.కులత్తుపుళ, 4.ఏరిమెలి, 5.శబరిమల.
 
సోరి ముత్తైయ్యన్ కోవెల  మరికొంత సమాచారం. నిన్నటి వివరణ తరువాతి భాగం. ఈ కోవెలకు పర్వ దినాలలో లక్షలాది భక్తులు వస్తూంటారు. భక్తులు తమపై గల భూత ప్రేత ప్రభావాలను తొలగించు కొనుటకు ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారు. ఈ ఆలయం చుట్టూ ప్రక్కల అనేక దేవీ దేవతల ఆలయాలు కలవు. 

1. పట్టవరాయన్ కోవెల: ఇక్కడి దేవుడు పశువులను కాపాడు దైవం. ఇక్కడ ఒక బ్రహ్మ రాక్షసిని బిడ్డలకై కోర్కెలు కోరుతారని  అని చెబుతారు. ఇక్కడ ఒక విప్ప చెట్టు ఉంటుంది.  ఆ వృక్షము సంతానమునకై భక్తులు కట్టే గంటలు మ్రింగునట. ఇప్పటికి ఆ చెట్టు కాoడమందు వివిధ ఆకృతులు గంటలు, మ్రింగిన దానిపై చెట్టు వున్నట్లు చెబుతారు. ఇదంతా శాస్థా ఇక్కడి స్వయంభూ లింగ మహిమలంటారు. స్వామి వారి పర్యవేక్షణలో మూలాధారం చక్రము మేల్కొని, మానవాళికి  కుండలిని సాధనకు ఉపయోగపడునని చెబుతారు. భక్తులు ఇక్కడకు వచ్చి, సంతాన భాగ్యము, భయము, దుష్ట శక్తి బారి నుండి రక్షణ, రోగాలబారి నుండి విముక్తి, ఆరోగ్య ప్రాప్తికి ప్రార్థనలు జరుపుతారు. ఇది కేవలం మూలాధార చక్ర ప్రవృత్తి ద్వారా మాత్రమే సుసాధ్యము. 

స్వామి ఇరు వైపులా అమరి ఉన్న దేవేరీలు జ్ఞాణ, భక్తికి ప్రతీకలుగా చెబుతారు. ఇక్కడ మాలధరించే భక్తులకు "చైతన్యం" కలిగి కుండలిని శక్తిని మేల్కొలిపి భక్తి మార్గంలో పయనించి, తమ ఆధ్యాత్మిక సాధనము సఫలీకృతం చేసుకొంటారు అని అనటంలో, ఏ మాత్రం సంశయము లేదు. 

2. అచ్చన్ కోవిల్ శ్రీ ధర్మ శాస్తా  (స్వాధిష్టాన చక్రం) 
పశ్చిమ కనుమల దట్టమైన అరణ్యమందు, కేరళ రాజ్యంలో కొల్లమ్ జిల్లాలో శ్రీ ధర్మశాస్తా కోవెలను మనం దర్శించ వచ్చు. ఈ కోవెల ప్రధాన ద్వారం వద్దనే భక్తులకు వారికే తెలియని ఒక అలౌకికమైన ఆనందం, ఉద్వేగం ఏర్పడుతుంది. ఈ. ఆలయంలోకి అడుగు పెడుతుండగానే భక్తులకు అలౌకిక మానసిక, శారీరక ఉల్లాసము ఏర్పడుతుంది. అరణ్య మార్గ ప్రయాణ బడలిక మచ్చు కైనను కానరాదు.
 
ఇచట అమరివున్న శాస్తా  స్వామి ని మహావైద్య శాస్తా  అంటారు. స్వామి తన కుడిచేతిలో గంధము ధరించి వుంటారు. మహారాజుగా కొలువబడి ఐశ్వర్యప్రధాతగా వుంటారు.భక్తులు కోరిన కోర్కెలెల్ల తీర్చు అభయ ప్రదాత. స్వామి, పూర్ణకళ మరియు పుష్కళా సమేతుడై దర్శనం ఇస్తారు. 
 
ఇది ఇప్పటికి కాపాడబడుతున్న పరశురామ ప్రతిష్ట విగ్రహం. ఈ విగ్రహం హిమాలయా పర్వతాలనుండి కొని తేబడిన పంచ శిలా విగ్రహం. అందువల్ల ఈ విగ్రహం అభిషేకించిన గంధం కానీ జలము కానీ ఔషాదంగా నేటికి మారి పోతున్నది. భక్తుల శరీరంలోని విషహరిని ఈ తీర్థం. ఈ ఆలయ దర్శనం అవుతూనే ఆదినమే, మిగాతా మరుసటి రెండు ఆలయాలు దర్శించాలి అని అక్కడి నియమము. మిగిలిన రెండు దుర్భేద్యమైన మార్గంలో 40 కి.మీ ప్రయాణం చేయవలసి ఉంటుంది. ఇక్కడి స్వామి దర్శనం వలన స్స్వాధిష్టాన  చక్రం మేల్కొలపబడి ఆరోగ్యం, ముఖ్యముగా స్త్రీల ఉదరవ్యాధులు, నెలసరి సమస్యలు, సంతాన లేమి బాధలు తీరిపోవునని విశ్వాసము. ఆపాన వాయువు సమస్యలు నివారింపబడును.  

పై సమస్యలే కాక ముఖ్యముగా పాము కాటుకు విషహరిణి ని ఇక్కడి పూజారులు 24 గంటలు ఇచ్చుటకు సిద్ధముగా నుంటారు.

ఇట్లు
భవదీయుడు

L . రాజేశ్వర్ 

Quote of the day

The life ahead can only be glorious if you learn to live in total harmony with the Lord.…

__________Sai Baba