అభీష్టదాయ శాస్తా
హరిహర పుత్రుడు శ్రీ ధర్మశాస్తా కథలు - 14
సాధ్యం స్వభాసేన విపధ్యకాటం
నిభదయంతంకలుసాధ
కస్య
పాదాబ్జ యోర్దoడ ధరమ్ త్రినేత్రం
భజేత శాస్తారం అభీష్ట
సిద్ద!! (మంత్రమహాదతి)
స్వామి తన భక్తుల అభీష్టములను తన పశాంకుశ ఆయాయుధము చేత భందించి లాగుకొని వచ్చి వారికిచ్చును. త్రినేత్రములు కలిగి ఉన్న వారయిన శ్రీ శాస్తా వారిని నా యొక్క ఇష్ట కామ్య సిద్ధి కొరకు ప్రార్థించి నమస్కరిస్తున్నాను. మంత్రముల నిఘంటువు అగు "మంత్రమహోదతి"
లో వర్ణింప బడియున్న అభీష్టదాయ శాస్తాను వారికై వున్న మూలమంత్రముతో ధ్యానించి, ఉపాసించి వారికి పొంద లేని దేదియును లేదని ప్రాజ్ఞులు అంటారు. వారు కోరుకునే వరములు అన్నింటినీ శ్రీశాస్తా వారు వెను వెంటనే ప్రసాదిస్తారు. స్వామి తన ఎనమండుగురు పరివార గణములతో ద్వారకాపురి సమీపాన కల రైవత్ర గిరి యందు నిత్య నివాసముండునట్లు వర్ణింపబడినది. ఈ స్వరూపమును గల 32 అక్షరముల మూల మంత్రము తో అనుదినము త్రిసంధ్యలలో జపము చేయవలెను. ఇలా ఒక లక్ష సార్లు జపము చేసిన సాధకుడు, తాను కోరిన కోర్కెలు సకలము పొందగలరని చెబుతారు.
...శుభం భూయాత్...
L. రాజేశ్వర్