Online Puja Services

జ్ఞానోదయo కలిగించే ఉదాహరణ

3.129.67.248
ఒక మంచి జ్ఞానోదయo కలిగించే ఉదాహరణ లాంటి నిజం: ఒకడు ఎలాగైనా ధనం సంపాదించాలని ,
చాలా కస్టపడి సుమారు 1,000 కోట్లు రూపాయిలు సంపాదించాడు.
 
ఒకరోజు , తాను ఎంతో కష్టపడి , చెమటోడ్చి సంపాదించిన ధనం , తాను చనిపోయినా సరే ఎవరికీ , ఒక్క పైసా కూడా ఇవ్వకూడదని , బాగా ఆలోచించి , పేపర్లో ఒక ప్రకటన ఇచ్చాడు
 
, ఏమని అంటే , *ఎవరైతే నేను చనిపోయిన తరువాత నా డబ్బు నాతో తీసుకొని వెళ్లే సులువు (టెక్నిక్) చెపితే వారికి 10 కోట్లు ఇస్తానన్నాడు*.
 
నెల గడిచినా ఎవరు రాలేదు. మల్లీ 100, 200 కోట్లు ఇస్తానన్నా ఒక్కరు కూడా రాలేదు. దానితో చాలా బెంగతో , చిక్కి సగం అయిపోయి ఉండగా......
 
ఈలోగా అకస్మాత్తుగా ఒక 
*జ్ఞాని* వచ్చి
నేను మీ డబ్బు మీరు చనిపోయిన తరువాత కూడా మీకు ఉపయోగపడే సులువు టెక్నిక్ చెపుతాను అని అన్నాడు.
 
ఎలా ? అని ప్రశ్నించేడు కోటీశ్వరుడు.
 
దానికి ఆ జ్ఞాని కోటీశ్వరునికి మీరు అమెరికా , ఇంగ్లండ్ , జపాన్ వెళ్ళారా ? అని అడిగేడు.
Ans :-Yes.
 
Q ;- అమెరికాలో మీరు ఎన్ని రూపాయలు ఖర్చు చేశారు అని అడిగాడు 
Ans: - నా Indian currency అమెరికాలొ చెల్లదు. 
కనుక నా రూపాయలను డాలర్లు గా మార్చి తీసుకొని వెలతాను , అదే England ఆయితే pounds , జపాన్ ఆయితే Yens 
ఇలా ఏదేశం వెళ్తే , ఆ దేశ కరెన్సీ క్రింద నా రూపాయలను మార్చి , ఖర్చుకి తీసుకొని వెళ్తాను అని అన్నాడు..
 
ఇప్పుడు జ్ఞాని ఇచ్చిన *సలహా* *:-*
 
ఓ కోటీశ్వరుడా...............
అలాగే నీవు చనిపోయిన తరువాత కూడా , నీడబ్బు నీతో రావాలంటే , ఒకవేళ నీవు *నరకానికి* వెల్లాలి అని అనుకుంటే నీడబ్బును *పాపము* " లోనికి మార్చు. అంటే దుర్వినియోగం ,చెడు వ్యసనాలకి , పాపపు పనులలోనికి మార్చు.
లేదా ..... ఒక వేళ నీవు *దేవలోకానికి* వెళ్లాలంటే , నీ డబ్బును *దాన , ధర్మములు చేసి పుణ్యంగా* Exchange చేయు అని చెప్పగానే .........
 
ఆ ధనవంతునికి జ్ఞానోదయం కలిగి , ఆ జ్ఞానికి 100 కోట్లు తీసుకోమంటాడు.
 
దానికి జ్ఞాని నేను కష్ట పడి
పని చేయకుండా ఒక్క పైసా కూడా తీసుకోను అని సున్నితంగా తిరస్కరిస్తాడు.
 
అప్పుడు జ్ఞానోదయం అయ్యి తన సంపద అంతా సన్మార్గంలోనికి , పుణ్యo లోనికి , జ్ఞాని సలహాతో ఖర్చు చేయగా ,
*పాత పాప కర్మలు పరివర్తనతో నశిoచి , మంచి కర్మల వలన పుణ్య గతులకు వెళ్తాడు........*
 
అయ్యా..... ఇదండీ సంగతి
*మన సంపదలు మనతో వచ్చే విధానం*.
 
ఇక మన ఇష్టమే .
 
*మనం కష్టపడి సంపాదించినది మంచి ధర్మ మార్గం లో ఖర్చు చేసి , పుణ్యం గా మార్చి మనతో తీసుకొని వెల్దామా ?*
 
*ఎవరు చేసిన కర్మ* 
*వారే అనుభవిస్తారు*
*For Every Action*
*Equal & Opposite*
*. Reaction*
*ధర్మో రక్షతి రక్షతః*
 
- నరసింహమూర్తి 
 
 

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore