రజత భస్మం ఉపయోగాలు తెలుసుకోండి..
భస్మముల ఉపయోగాలు -
రజత భస్మము -
* రజత భస్మము సమస్త పిత్తరోగములను తగ్గించును .
* నెయ్యి , తేనెతో కలిపి తీసుకొనుచున్న నేత్రరోగములను పోగొట్టును .
* క్షయరోగమును తగ్గించును .
* మూలశంఖ సమస్య నివారణ అగును.
* ఉదర సంబంధ దోషములను నివారణ చేయును .
* పాండురోగ నివారణ అగును.
* దగ్గుని నివారించును.
* నోటికి రుచి తెలియని సమస్యని నివారణ చేయును .
* మధుమేహమునందు మంచి ఫలితాన్ని ఇచ్చును.
* స్త్రీలకు వచ్చు శ్వేత ప్రదర సమస్య అనగా వైట్ డిశ్చార్జ్ సమస్య నివారణ చేయును .
* శుక్రవృద్ధి కలిగించును.
* ముసలితనం త్వరగా రానివ్వదు.
రజతభస్మాన్ని స్వర్ణభస్మంతో తగు పాళ్ళలో కలిపి నేను ఇవ్వడం జరిగింది. వీటితో పాటు వజ్రభస్మాన్ని కలిపి ఇవ్వడం వలన అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. వజ్రభస్మం కేన్సర్ నివారణకు చాలా బాగుగా పనిచేయును .
తామ్ర భస్మం -
* తామ్రభస్మం కఫరోగములను నివారణ చేయడంలో సాటిలేనిది.
* జ్వరాన్ని నివారణ చేయును .
* శరీరంలో ఏర్పడే ఐదు రకాల గుల్మాలను పోగుట్టు శక్తి కలిగినది .
* క్షయ రోగ నివారణ చేయును .
* దగ్గు , ఆయాసాన్ని తగ్గించును .
* అజీర్ణరోగాన్ని నివరించును .
* కఫరోగమును పోగొట్టును .
* పాండురోగ నివారణ చేయును .
* పరిణామ శూలలు అనగా ఆహారం జీర్ణం అయ్యే సమయంలో కడుపులో వచ్చునొప్పిని నివారణ చేయును .
* యకృత్ ( Spleen ) , ప్లీహ రోగములు పోగొట్టును .
* శరీరపు లావును తగ్గించును .
* జీర్ణాశయ , ఆమాశయ సమస్యలను నివారణ చేయును .
* పెట్టుడు మందు విషాన్ని విరిచేయును .
* రక్తమును శుద్ది చేయును .
* కుష్ఠురోగములను పోగొట్టును .
* శరీరం బక్కచిక్కిన వారికి ఇచ్చిన కండపట్టి పుష్టిగా తయారగును .
పైన చెప్పిన భస్మములు సరైన పాళ్లలో తీసుకుని స్వర్ణభస్మముతో కలిపి ఇచ్చిన మంచి ఫలితాలు పొందవచ్చు. ఇక్కడ ముఖ్యముగా మనం తెలుసుకోవలసిన విషయం ఒకటి ఉన్నది. ఈ భస్మాలు సరైన వైద్యుని పర్యవేక్షణలో , సరైన మోతాదులో కలిపి మాత్రమే వాడుకొనవలెను . మూలికల కంటే భస్మాలు వేగవంతమైన ఫలితాలు ఇచ్చును.
తరవాతి పోస్టులో మరికొన్ని భస్మాల గురించి వివరిస్తాను.
గమనిక -
నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు " అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.
మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.
రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.
ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 50 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.
ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .
కాళహస్తి వేంకటేశ్వరరావు
9885030034
అనువంశిక ఆయుర్వేద వైద్యులు