కరోనా నుంచి లోక క్షేమం కోసం కంచి స్వామీజీ అందించిన స్తోత్రం
భూగోళాన్ని కల్లోలపరుస్తున్న కరోనా వ్యాధి నివారణ కోసం, లోక క్షేమం కోసం శ్రీ కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశంకర విజయేంద్ర సరస్వతీ స్వామి సంకలన పరచి అందించిన శ్లోకాలివి. ఈ శ్లోకాలలో ప్రస్తావించిన భగవంతుడి నామాలను ప్రజలు జపిస్తే, సత్ఫలితాలు కలుగుతాయి.
సంకల్పం:
మమోపాత్త శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం
జ్వర ఔపసర్గికాది నానావిధ, సాంక్రామిక రోగాణాం ఉన్మూలనార్థం, ఆరోగ్య ప్రాప్త్యర్థం, అస్మద్దేశీయానాం విదేశీయానాం చాపి సర్వేషాం వ్యాధి భయ నివృత్త్యర్థం సర్వలోక క్షేమార్థం, రోగ నివారక భగవన్నామ స్తోత్ర పారాయణం కరిష్యే
రోగ నివారణ శ్లోకాః
1. అచ్యుతానంత గోవింద నామోచ్చారణ భేషజాత్ |
నశ్యంతి సకల రోగః సత్యం సత్యం వదామ్యహం ||
శరీరే జర్జరీ భూతే వ్యాధిగ్రస్తే కళేబరే |
ఔషధం జాహ్నవీ తోయం వైద్యో నారాయణో హరిః || (ధన్వంతరి స్తోత్రం నుండి)
2. సుమీనాక్షిపతే శంభో సోమసుందర నాయక |
ఇమాం ఆపదముత్పన్నాం మదీయాం నాశయ ప్రభో ||
3. ఆర్తా విషణ్ణాః శిథిలాశ్చ భీతాః
ఘోరేషు చ వ్యాధిషు వర్తమానాః |
సంకీర్త్య నారాయణ శబ్ద మాత్రం
విముక్త దుఃఖాః సుఖినో భవంతి ||
(విష్ణు సహస్ర నామ స్తోత్రం నుండి)
4. బాలాంబికేశ వైద్యేశ భవరోగ హరేతి చ |
జపేన్నామ త్రయం నిత్యం మహారోగ నివారణం ||
(వైద్యనాథ స్తోత్రం నుండి)
5. పంచాపగేశ జల్ప్యేశ ప్రణతార్తి హరేతి చ |
జపేన్నామ త్రయం నిత్యం పునర్జన్మ న విద్యతే ||
6. అపస్మార కుష్ఠ క్షయార్శః ప్రమేహ
జ్వరోన్మాద గుల్మాది రోగా మహాంతః |
పిశాచాశ్చ సర్వే భవత్పత్రభూతిం
విలోక్య క్షణాత్ తారకారే ద్రవంతే ||
7. కిరంతీ మంగేభ్యః కిరణ నికురంబామృతరసం,
హృది త్వా మాధత్తే హిమకర శిలామూర్తిమివ యః |
స సర్పాణాం దర్పం శమయతి శకుంతాధిప ఇవ,
జ్వరప్లుష్టాన్ దృష్ట్యా సుఖయతి సుధాధారసిరయా ||
(సౌంద్యలహరి నుండి)
నామ జపం
అచ్యుతాయ నమః
అనంతాయ నమః
గోవిందాయ నమః
ఈ నామాలను 36, 108, 336 లేదా 1008 సార్లు జపించాలి.
ఇది కూడా చేర్చవచ్చు
8. అస్మిన్ పరాత్మన్ నను పాదకల్పే త్వమిత్థముత్థాపిత పద్మయోనిః।
అనంతభూమా మమ రోగరాశిం నిరుంధి వాతాలయవాస! విష్ణో!
(నారాయణీ యం స్తోత్రం నుండి)
9. రోగానశేషానపహంసి తుష్టారుష్టా తు కామాన్ సకలానభీష్టాన్ |
త్వామాశ్రితానాం న విపన్నరాణాం త్వామాశ్రితాహ్యాశ్రయతాం ప్రయాంతి ||
(దుర్గా సప్తశతి నుండి)