అరుణాచలం విశేషాలు తెలుసా మీకు?
అరుణాచలేశ్వర ఆలయం.
తిరువణ్ణామలై తమిళనాడు
అరుణాచలం లేదా "అన్నామలై" తమిళనాడు రాష్ట్రములో ఉంది. అరుణాచలం పంచభూతలింగ క్షేత్రాలలో ఒకటి. దక్షిణభారతంలో వెలసిన పంచలింగ క్షేత్రములలో అగ్నిభూతమునకిది ప్రతీక. అరుణాచలము అనగా అరుణ - ఎర్రని, అచలము - కొండ. ఎర్రని కొండ అని తాత్పర్యము. అ-రుణ అంటే పాపములను పరిహరించునది అని అర్ధము. తమిళంలో " తిరువణ్ణామలై " అంటారు. తిరు అనగా శ్రీ, అణ్ణామలై అనగా పెద్దకొండ అని విశ్లేషణ. ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రము. స్మరణ మాత్రము చేతనే ముక్తినొసగే క్షేత్రము. కాశీ, చిదంబరము, తిరువారూరుల కంటే మిన్నయని భక్తులు విశ్వసిస్తున్నారు.
అరుణాచలం వేద, పురాణాలలో కొనియాడబడ్డ క్షేత్రము. అరుణాచలేశ్వర దేవాలయం శివాజ్ఞచేత విశ్వకర్మచే నిర్మింపబడిందనీ, దాని చుట్టూ అరుణమనే పురము నిర్మింపబడినదనీ పురాణములు తెలుపుతున్నాయి. అక్కడ జరుగవలసిన పూజావిధానమంతా గౌతమ మహర్షి శివాజ్ఞ చేత ఏర్పాటు చేశారని స్కాంద పురాణాంతర్గతమైన అరుణాచలమహాత్మ్యం తెలుపుతున్నది. ఈ కొండ శివుడని పురాణములు తెల్పుచుండటము చేత ఈ కొండకు తూర్పున గల అరుణాచలేశ్వరాలయము కంటే ఈ కొండకే ఎక్కువ ప్రాధాన్యమీయబడుతున్నది. ఇది జ్యోతిర్లింగమని చెప్పుకొనబడుతున్నది. ఇది తేజోలింగము గనుక అగ్ని క్షేత్రమంటారు.
ఈ అరుణాచలం పరమేశ్వరుని జ్యోతిర్లంగ స్వరూపం కావటంవలన దీనిని చుట్టూ ప్రదక్షిణం చేయటం సాక్ష్తాత్తు శివునికి ప్రదక్షిణము అని భక్తుల విశ్వాసం. రమణ మహర్షి దీని ప్రాముఖ్యాన్ని పదేపదే ఉద్ఘోషించి ఉన్నారు, పాదచారులై శివస్మరణగావిస్తూ ప్రదక్షిణ చేసేవారికి మహాపుణ్యం సిద్ధిస్తుందని మహాత్ముల వచనం. అందుచేత నిత్యమూ, అన్నివేళలా ఎంతోమంది గిరిప్రదక్షిణం చేస్తూ ఉంటారు. గిరిపైన గల మహౌషధీ ప్రభావం వల్ల శరీరమునకు, శివస్మరణవల్ల మనస్సుకూ, శివానుగ్రహం వల్ల ఆధ్యాత్మిక జీవనానికి స్వస్ధత చేకూరుతుందని భక్తుల నమ్మకం. గిరిప్రదక్షణం చాలా వరకు తారు రోడ్డు పైనే జరుగుతుంది. ఈ మధ్య కాలంలో గిరిప్రదక్షణం చేయడానికి వీలుగా రోడ్డు పక్కన కాలిబాట కూడా వేసారు. ఎక్కువ మంది ఉదయం సూర్యతాపాన్ని తట్టుకోవడం కష్టం కనుక రాత్రి పూట లేదా తెల్లవారుజామున చేస్తారు. రమణాశ్రమానికి 2 కి.మీ. దూరం వెళ్ళిన తరువాత కుడివైపుకు తిరిగి రోడ్డుకి మధ్యలో వినాయకుడి గుడి వస్తుంది . అక్కడ నుండి కొండను చూస్తే నందిలాగా కనిపిస్తుంది.
పురాణగాధ
త్రిమూర్తులలో అత్యంత శక్తివంతమైనది ఎవరు అనే విషయంపై బ్రహ్మ, విష్ణువు ఒకప్పుడు వాదించారు. శివుడు జోక్యం చేసుకోవాల్సిన వాదన వేడెక్కింది.
శివుడు ఒక భారీ మండుతున్న లింగం యొక్క రూపాన్ని స్వీకరించాడు, అది స్వర్గం వరకు వెళ్లి భూమిలోకి లోతుగా దిగింది. జ్వాల ముగింపును ఎవరైతే కనుగొంటారో వారు గొప్పవాడిగా ప్రకటించబడతారు. బ్రహ్మ తన మౌంట్ హంసా (హంస) తీసుకొని, లింగం వరుసలో పైకి వెళ్లి దాని ముగింపును కనుగొన్నాడు. అతను లింగం పైనుండి పడిపోతున్న కేటాకి పువ్వును చూశాడు మరియు లింగా చివర దూరం గురించి అడిగాడు, తద్వారా అతను 40 కిలోల నుండి పడిపోతున్నానని కేతకి సమాధానం ఇచ్చాడు! అతను చివరికి చేరుకోలేడని గ్రహించి, పువ్వును తప్పుడు సాక్షిగా వ్యవహరించమని కోరాడు - బ్రహ్మ లింగం చివరికి చేరుకున్నాడు. కేతకి పువ్వు తప్పుడు సాక్షిగా వ్యవహరిస్తూ బ్రహ్మ శివలింగ ముగింపును చూశారని ప్రకటించారు. సత్యాన్ని తెలుసుకున్న శివుడు మోసానికి కోపం తెచ్చుకున్నాడు మరియు బ్రహ్మకు భూమిపై దేవాలయం ఉండకూడదని మరియు కేతకి పువ్వును ఆరాధించేటప్పుడు ఉపయోగించరాదని శపించాడు.పోరాడుతున్న దేవతల అహాన్ని తొలగించడానికి శివుడు మండుతున్న బ్రహ్మాండమైన లింగాన్ని నిలబెట్టిన ప్రదేశం తిరువన్నమలై మరియు నిర్మించిన ఆలయానికి అరుణాచలేశ్వర ఆలయం అని పేరు పెట్టారు.
నిర్మాణం
ఈ ఆలయ సముదాయం 10 హెక్టార్లలో విస్తరించి ఉంది. ప్రస్తుత నిర్మాణం 9 వ శతాబ్దంలో చోళ రాజవంశం సమయంలో నిర్మించబడింది, తరువాత విస్తరణలు సంగమ రాజవంశం (1336–1485 CE), సాలూవ రాజవంశం మరియు తులువా రాజవంశం (1491–1570 CE) యొక్క విజయనగర పాలకులకు ఆపాదించబడ్డాయి.
రాజగోపురం
ఇది శ్రీకృష్ణదేవరాయల నిర్మాణం. రాజగోపురం క్రింది భాగం (బేస్) 135 X 98 అడుగులు. ద్రవిడదేశంలో రాజరాజచోళుడు కట్టించిన తంజావూరు బృహదీశ్వరాలయ గోపురం (ఎత్తు 216 అడుగులు ) కంటే ఒక అడుగు ఎక్కువగా ఉండేలా, శ్రీకృష్ణదేవరాయల కట్టించినదీ పదకొండు అంతస్తుల రాజగోపురం. (శతాబ్దాల తర్వాత1987లో కట్టిన శ్రీరంగం ఆలయగోపురం ఎత్తు 239 అడుగులు – ఆ తర్వాత 2008లో నిర్మించిన కర్ణాటకలోని మురుడేశ్వర ఆలయగోపురం ఎత్తు 237 అడుగులు. కానీ ఇవి ఇటీవల కాలంలో కట్టిన సిమెంట్ నిర్మాణాలు).
గోపుర గణపతి
ఈ ప్రాకారంలో ప్రముఖంగా కనిపించే వెయ్యిస్తంభాల మండపం, శివగంగ తటాకం కూడా శ్రీకృష్ణదేవరాయల నిర్మాణాలే. ఆలయం లోపల మూలవిరాట్ కొలువైన గర్భగుడిని మొదటి ప్రాకారంగా భావిస్తే, ఇప్పుడు మనం రాజగోపురం లోపలినుంచి వచ్చి ప్రవేశించాలి – ఐదవ ప్రాకారమన్నమాట. అరుణచలేశ్వరాలయం ఐదు ప్రాకారాలను పంచకోశములుగా అంటే అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలకు ప్రతీకలుగా చెబుతారు.
అరుణాచలేశ్వరాలయం తొమ్మిది గోపురాలు
ఆలయానికి నాలుగు దిక్కులా నాలుగు పెద్ద గోపురాలు తూర్పు: రాజగోపురం(ఎత్తు 217అడుగులు) పడమర :పేయి గోపురం (ఎత్తు 144అడుగులు) దక్షిణం : తిరుమంజన గోపురం(ఎత్తు 157అడుగులు) ఉత్తరం: అమ్మణియమ్మ గోపురం(ఎత్తు171అడుగులు) – ఇవి కాక ఆలయం లోపల ప్రాకారంలో దక్షిణ, పడమర, ఉత్తర దిక్కుల్లో మూడు కట్టాయి (చిన్న) గోపురాలూ, నాలుగవ ప్రాకారానికి తూర్పు- పడమరగా వున్న భళ్ళాలగోపురం, కిళిగోపురంతో కలుపుకొని అరుణాచలేశ్వర ఆలయానికి మొత్తం తొమ్మిది గోపురాలున్నాయి.
శ్రీ రమణాశ్రమము
రమణాశ్రమం అరుణాచలేశ్వరాలయమునకు 2 కి.మీల దూరంలో ఉంటుంది. అరుణాచలం వెళ్ళిన వాళ్ళు రమణాశ్రమాన్ని సందర్శిస్తూంటారు. అక్కడ స్థానికులకంటే విదేశీయులే ఎక్కువగా కనిపిస్తారు. సాయంత్రం సమయంలో రమణాశ్రమంలో చెసే ప్రార్థన చాల బాగుంటుంది . రమణాశ్రమంలో రమణుల సమాధిని మనం చూడవచ్చు . రమణాశ్రమం (Ramana ashramam) లో కోతులు ఎక్కువగ మనకు కనిపిస్తాయి . నెమళ్ళు కూడా స్వేచ్ఛగా తిరుగుతూంటాయి. రమణాశ్రమంలో ఇంకా లక్ష్మి (ఆవు) సమాధి, కాకి సమాధి, శునకం యొక్క సమాధిని కూడా చూడవచ్చు . ఇవన్నీ వరుసగా ఉంటాయి. అక్కడ గ్రంథాలాయంలో మనకు రమణుల గురించిన పుస్తకాలు లభిస్తాయి.
శేషాద్రి స్వామి ఆశ్రమం
రమణాశ్రమం కంటే ముందే మనకు శేషాద్రి స్వామి అశ్రమం కనిపిస్తుంది. శేషాద్రి స్వామి సమాధి కూడా అక్కడే ఉంది.
- L. రాజేశ్వర్