అది దంపతులంటే పార్వతీ పరమేశ్వరులే
దంపతులు ఆది దంపతులు
శివపార్వతుల కళ్యాణానికి వెళ్లిన ఓ ముసలి ముత్తయిదువ పక్కన కూర్చున్న పేరంటాలితో గుసగుసగా ఈ మాటలు అంది..
ఇదేం విడ్డూరం అమ్మాయ్!
పార్వతి దేవి *ఎండకన్నెరుగని పిల్ల*, పరమేశ్వరుడేమో *ఎండలో ఎండిపోతూ వానలో తడిసిపోతూ శ్మశానాల్లో బతికే రకం*!
ఆమె తనువంతా *సుగంధ లేపనాలు*, అతడి శరీరమంతా *బూడిద గీతలు*.
ఆమె చేతులకు *వంకీలు*,
అతడి చేతులకు *పాము పిల్లలు*.
ఎక్కడా పొంతనే లేదు చూస్తూ ఉండూ...నాలుగు రోజులైతే పెళ్ళి పెటాకులవుతుంది! అంది.
నాలుగు రోజులు కాదు, నాలుగు యుగాలు గడిచిపోయాయి...
కానీ వారు *ఆదిప్రేమికులు*, *ఆదిదంపతులు* గా
వర్ధిల్లుతూనే ఉన్నారు.
బయటికి కనిపించే రూపాన్ని కాదు
శివుని *అంతః సౌందర్యాన్ని* చూసింది పార్వతి దేవి"అతడు *విష్ణువు* అయితే ఆమె *లక్ష్మీ దేవీ*.
అతడు *సూర్యడైతే* ఆమె *నీడ*.
అతడు *పదం* అయితే ఆమె *అర్థం*.
అలా అని ఆ దంపతుల మధ్య
*విభేదాలు* రాలేదా అంటే వచ్చాయి,
ఆ కాపురంలో *సమస్యలు* తలెత్తలేదా అంటే తలెత్తాయి.
ప్రతి సమస్య తర్వాత ఆ బంధం మరింత బలపడింది
ప్రతి సంక్షోభం ముగిశాక ఒకరికి ఒకరు బాగా అర్థమయ్యారు*.
ఏ ఆలుమగలైనా *పట్టువిడుపుల* పాఠాల్ని
శివపార్వతుల నుంచే నేర్చుకోవాలి!
ఒకసారి శివుడు *మాట చెల్లించుకుంటే*,
మరోసారి పార్వతి *పంతం నెగ్గించుకుంటుంది*!
మధురలో *అమ్మవారిదే పెత్తనం
సుందరేశ్వరుడు కేవలం మీనాక్షమ్మకు మొగుడే.
నైవేద్యాలు కూడా దొరసానమ్మకు నివేదించాకే దొరవారికి.
అదే చిదంబరంలో నటరాజస్వామి మాటే శాసనం.
శివకామసుందరి *తలుపుచాటు ఇల్లాలు*.
ఒక్క మధురై, ఒక్క చిదంబరం ఏంటి!
ఇలా *ఎన్నోచోట్ల భార్య పెత్తనం*
అలానే *భర్త పెత్తనం మరి కొన్నిచోట్ల*.
అందుకే వారు ఇద్దరూ జగత్తును ఏలే ఆదిదంపతులు* అయినారు పార్వతీపరమేశ్వరులు
.
అందుకే ఏ జంటను దీవించాలన్నా *పార్వతి పరమేశ్వరులు గా కలకాలం ఉండండి* అని దీవిస్తారు.
సర్వే జానాః సుఖినో భవంతు
-
మల్లిఖార్జున