Online Puja Services

భక్తి అంటే?

216.73.216.220
భక్తి అంటే కేవలం భగవత్‌ సంబంధమైన 
పూజలు, 
వ్రతాలు, 
నోములు, 
అభిషేకాలు వంటి సత్కర్మలు మాత్రమే కాదు. 
 
జీవన స్రవంతిలో సాధారణంగా ఎదురమ్యే సమస్యలు, కష్టనష్టాలను అధిగమించడం కోసం భగవంతుని ఆశీస్సులనర్థిస్తూ చేసే కార్యక్రమాలు కూడా కాదు. ‘‘ఈ కష్టం గట్టెక్కితే హుండీలో ఇంత సొమ్ము సమర్పించుకుంటా, మళ్లీ నీ దర్శనానికి వస్తాన’’ని మొక్కుకోవడం, కోరికలు తీరితే భగవంతుడు అనుగ్రహించాడని ఆనందపడటం, లేకుంటే ఆ దేవుడికి తమపై దయ కలగలేదని బాధపడటం.. భక్తి అనిపించుకోదు. అది భగవంతుడితో బేరాలాడటమే. 
 
సర్వమూ తానే అయిన భగవంతుడు.. మనం ఇచ్చే ముడుపులు, కానుకల కోసం ఎదురు చూస్తాడా? కాసులు కురిపించిన వారినే కరుణిస్తాడా? అలా భావించడం ఎంత అమాయకత్వం? భక్తి అంటే సరియైున అర్థం.. ఆ భగవంతుణ్ని ప్రాణప్రదంగా ప్రేమించడం, త్రికరణశుద్ధిగా విశ్వసించడం. మన అభీష్టాలు తీర్చాలని కోరుకోవడానికి కాకుండా.. దైవం కొరకే దైవాన్ని ప్రార్థించడం. భగవంతుడిని అనుక్షణం మనసులో నిలుపుకొంటూ.. ఆయన దివ్యనామం ఎక్కడ వినిపించినా ఆనందపరవశులంగావటమే భక్తి. 
 
భగవంతుడు సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సకల హృదయ వాసి, సృష్టి, స్థితి, లయకారకుడు, జగ్‌ కర్త, భర్త, హర్త అని బలమైన విశ్వాసం కలిగి ఉండడమే భక్తి. నిజమైన భక్తులకుభయం అంటే ఏమిటో తెలియకూడదు. ఒకవైపు భగవంతునిపై విశ్వాసమున్నదని చెబుతూ.. మరోవైపు ఏమి జరుగుతుందోనని భయపడుతుండడం భక్తి అనిపించుకోదు. అంతమాత్రాన లోకసహజమైన సమస్యలు భక్తులకు రావని, రాకూడదని భావించడం కూడా సరిగాదు. సంసారసాగరంలో ఎదురయ్యే కష్టనష్టాలు సముద్రంలో సదా చెలరేగే అలల వంటివే.
 
సముద్రం ఒడ్డున ఉండే శిలలు.. అలల తాకిడికి మరింత నున్నగా, అందంగా తయారైనట్టు.. సంసార సాగరంలో అలలు, అలలుగా ఉత్పన్నమయ్యే సమస్యలను కూడా తట్టుకునే దృఢచిత్తులం కావాలి. సంయమనం పాటిస్తూ ఇనుపగుండు వలె ఉండాలి. అంతేతప్ప.. గాలికి అల్లల్లాడే చిగురుటాకులా, ఎగిరిపోయే ఎండుటాకులా ఉండటం భక్తుల లక్షణం కాకూడదు. ఇలా ఉండగలగాలంటే వేదాలు, ఉపనిషత్తుల సారాన్ని, శ్రీకృష్ణుని గీతోపదేశాన్ని అవగాహన చేసుకోవాలి. అన్నింటిపట్లా వైరాగ్యభావం అలవరచుకోవాలి. ఎందుకంటే.. మనకు కనిపించేది, వినిపించేది, మనది అనుకున్నది ఏదీ శాశ్వతం కాదు. భౌతికమైన, లౌకికమైన ప్రతి అంశానికీ ఏదో ఒకనాడు ముగింపు ఉండే తీరుతుంది. కష్టమైనా అంతే. సుఖమైనా అంతే. ఏవీ మనను కలకాలం అంటిపెట్టుకొని ఉండవు. అన్నీ కదిలిపోయే మేఘాలే. లోకధర్మమైన, సహజ సిద్ధమైన ఈ కాలచక్ర పరిణామక్రమాన్ని సరిగ్గా అర్థం చేసుకొని ఆచరిస్తే ఏ సమస్యలూ మనను బం ధించవు, వేధించవు, భయభ్రాంతులకు గురిచేయవు. 
 
ఆ స్థితప్రజ్ఞత లభించేలా చేయడంలో మనకు ఉపకరించేది.. నిజమైన భక్తి మా త్రమే. అందుకే భగవంతునిపై భక్తిని ఒక జీవన విధానంగా మా ర్చుకోవాలి తప్ప.. మొక్కులకో, కానుకలకో పరిమితం కాకూడదు.
 
- రాజేంద్రప్రసాద్ తాళ్లూరి 
 
 
 

Quote of the day

As a single withered tree, if set aflame, causes a whole forest to burn, so does a rascal son destroy a whole family.…

__________Chanakya