వేద శాస్త
హరిహర పుత్రుడు శ్రీ ధర్మశాస్తా కథలు. సీరియల్ నం.13.
యోగీనాంచ యతీనాంచా జ్ఞానినాo మంత్రిణా త్వత:
ధ్యాన పూజా నిమిత్తాయ నిష్కళం సకలం భవేత్
యోగులు. సన్యాసులు, జ్ఞానులు,మంత్రజ్ఞులు మొదలగు వారికై నిర్గుణ రూపుడైన భగవంతుడు, సగుణ స్వరూపుడై గోచరించుచున్నాడు. తనను నమ్మివారికి మంచి చేయుటకై పలు రూపములను ధరించు చున్నాడు. కరుణా సముద్రుడైన శాస్తా యొక్క కారుణ్యము ఎల్లలు లేనివి. అందువలననే జ్ఞానులైన వారు తడిసి, మునిగి, తదాత్యము చెంది, స్వామి అవతార రూపములకు అనేకములైన పేర్లనిడినారు. పేర్లు వివిధములైనను, రూపములు వేరువేరు అయినను అన్నింటికీ అతీతుడుగా ప్రకాశించువాడే మహశాస్తా.
వేద శాస్త (సింహా రూఢ శాస్తా)
సింహారూఢం త్రినేత్రం త్రిదశ పరివృడo సుందర భ్రూవిలాసం
శ్రీ పూర్ణా పుష్కలేశంశృతి వినుతపదo శుద్ధ భస్మాగరాగం
శాంతం శంకారి పoకేరుహ లసితకారం సచ్చిదా నందమూర్తిo
శాస్తారం ధర్మ పాలం హరిహరితనయం సాక్షీ భూతం భజేహం!!
సింహ వాహనుడు, త్రినేత్రుడు, 33 కోట్ల దేవతలచే పూజింపబడు చుండువాడు, అందమైన కనుబొమ్మలు కలిగివున్న వారు, పూర్ణ పుష్కళా దేవీరుల ప్రాణ నాథుడు, వేదముల నుతించే పాదారవిందములు కలవాడు, శుద్ధ భస్మమును అంగములయందు ధరించికొని యుండు వారు. శాంత స్వరూపి, ఒక చేతియందు కమలం, మరొక చేయి అభయముదాల్చి యుండు సచ్చిదానందమూర్తియు, పరిపాలనలో సారథులు, ధర్మరాక్షణాధికారియు, ప్రపంచ మంతటా వ్యాపించి యుండి అన్నిటికీ సాక్షి భూతుడై వెలసిన ఆ హరి హరపుత్రుడు అయిన శ్రీధర్మాశాస్తా కు నమస్కరిస్తున్నాను.
వేదశాస్తా (మరొక స్వరూపం)
హరిహర శరీర జన్మల మరకతమణిక్లుప్త మేకల యుక్తహః
విజయతు వేదశాస్తా సకల జగత్పితః మోహకృన్ర్మూర్తి:
హరిహర నందనుడు, మరకత మణులు పొదిగిన మొలత్రాడు ధరించి యుండువారు, లోకుము లోని వారినందరిని మోహింప చేయగల సందర రూపి, వేదశాస్తా వారికి జయము కలిగిన, సింహారూఢ శాస్తా ధర్మ స్వరూపుడు, ధర్మమును భువిపై నెల కొలుపుటకే ఆవిర్భవించిన వారు, జనులను ధర్మ మార్గములో నడిపించి, అలా నడచు కొను వారికి తన అనుగ్రహమును కొరత లేక ప్రసాదించు వారు, అన్నదాన ప్రియుడాయన. అందులకే వారిని ధర్మ శాస్థా యందురు.
L. రాజేశ్వర్