భగవద్గీత
అమృత వాక్కులు
భగవద్గీత
భగవత్ గీతలోని కొన్ని ముఖ్యమయినవి ఈ క్రింద పరిశీలనార్థం వున్నవి.
1) ఒక్కసారి ఆత్మజ్ఞానం కలిగితే మనిషి మహనీయుడు అవుతాడు.
2) జ్ఞానం, సాధన తోనే సాకారమౌతుంది.
3) మనసు చేసే మాయాజాలమే ఆనందం, విచారాలు.
4) భవిషత్తులో సాధించాల్సిన విజయాన్ని గుర్తు చేసుకుంటూ అందుకు
అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి.
5) ఆకర్షణలనే మాయ పొరలు మనసును కమ్మితే ఇక చేయాల్సిన కర్తవ్యాన్ని వదిలేస్తాం. ఏది మంచో ఏది చెడో విచక్షణతో ఆలోచించాలి. లేదంటే కోల్పోయేది బుద్ధి మాత్రమే కాదు. భవిష్యత్తు కూడా.
6) ఓర్పు, దయ, శాంతి, సహనం, క్షమతోనే అద్భుతమైన జీవితం
సాధ్యమౌతుంది.
7) ఎప్పుడైతే పరుషమైన పదం మన నోటి నుంచి రాదో అప్పుడు మనల్ని ద్వేషించే వారెవ్వరూ వుండరు. అంతిమంగా మనకు ఏ విధమైన అశాంతి కలగదు.
8) మనలో వున్న దైవత్వాన్ని అంగీకరించి, సాటి ప్రాణుల్లో ఉన్నది కూడా
ఆ పరతత్వమేనని గుర్తించగలగాలి. దాన్ని మోక్ష సాధన అంటారు.
9) నేర్చుకోవాలనుకున్న వ్యక్తి గురువు దగ్గరకు వినయంతో వెళ్ళాలి. శరీరం, మనసు, బుద్ధి, మూడింటిలోనూ విధేయతను ప్రకటించాలి.
గురువును శరణాగతి పొంది జ్ఞానాన్ని ఆర్జించాలి.
10) పరమాత్మ బోధించినట్లు మనోదౌర్బల్యాన్ని విడిచి పెట్టాలి.
సాహసాన్ని శ్వాసగా చేసుకోవాలి.
11) మనిషి విజయానికి మనసే మూలకారణం. ధైర్యం లేని మనసు ఏ
ప్రయత్నాన్ని చెయ్యలేడు, ఏ విజయాన్ని సాధించలేడు. అన్యాయాన్ని ఎదుర్కోలేడు, అందుకే మనిషికి దైర్యం వుండాలి ఏదైనా సాధించడానికి.
12) వరాహ పురాణంలో గీతకు 18 పేర్లను సూచించింది. అవి, గీత,
గంగ, గాయత్రి, సీత, సత్య, సరస్వతి, బ్రహ్మవిద్య, బ్రహ్మవల్లి, త్రిసంధ్య, ముక్తి, గేహిని, అర్థమాత్ర, చిదానంద, భవఘ్ని, భయనాశిని, వేదత్రయి, పఠ, అనంత, తత్వార్థ, జ్ఞానమంజరి.
- బిజ్జా నాగభూషణం