Online Puja Services

మహా శాస్తా

3.145.138.21
హరి హర పుత్రుడు 
ధర్మశాస్తా కథలు. సీరియల్.నం.11*
  
 
 
 ఈ దినము మహా శాస్తా

అశ్యామ కోమల విశాల తనుమ్ విచిత్ర 
వాసో వసానం అరుణోత్పల దామ హస్తం 
ఉత్తుంగ రత్న మకుటం కుటిలాగ్ర కేశం 
శాస్తారం ఇష్ట వరదo శరణం ప్రభధ్యే! 
 
లేత నీలి రంగు మేని కలవాడు, పలువర్ణ దుస్తులను ధరించిన వాడు, కలువ పూవును చేతి యందు ధరించిన వాడు, రత్న మకుట్రమును ధరించిన వాడు శిరస్సు పై భాగమున కొప్పుగా ముడివేయబడిన  అందమైన కేశములు కలవాడు, కోరిన వరములను ప్రసాదించు శాస్తాను శరణు కోరుచున్నాను. 
 
**********

ఒకపరి దేవతలకు ఆసురులకు ఘోరమైన యుద్ధము సంప్రాప్తమైనది. నారాయణుడు దేవతలకు తోడుంటం వలన, పరాజితులైన ఆసురులు పలాయనం చిత్తగించారు. నారాయణుడు వారిని తరుముతూ, వెళ్లగా వారు తప్పించుకొని పోయి భృగు మహర్షి ఆశ్రమము చేరిరి. అప్పుడు భృగు మహర్షి ఆశ్రమమునందు లేరు. వారు ఋషిపత్ని 'శయాతి ' శరణు కోరగా, ఆమె వారికి అభయమిచ్చినది. నారాయణుడు వెళ్లగా, ఆమె తనపతి వచ్చుదాకా ఆగమని, తాను వారికి అభయమునిచ్చినట్లుగా విన్నవించెను. నారాయణుoడు, వారిని, వారితో పాటు అడ్డు తగిలిన శయాతిని కూడా వధియించెను.

తిరిగి వచ్చిన భృగువు విషయము తెలిసినవాడై, తనకు పత్నీ వియోగము కలిగించిన హరి ఎన్ని అవతారములు ఎత్తినను  పత్నీ వియోగము తప్పదని నారాయణుని శపించెను. మహర్షి శాపము తెలుసుకొన్న హరి, శివుని ప్ర్రార్తింప, శివుడు భృగువు ను సమాధాన పరిచెను. కానీ తన శాపము తప్పదని, హరి పది జన్మలెత్తినను అందు ఒక జన్మలోనైనను పత్నీవియోగము తప్పదనెను.  అంతయు లోక కళ్యాణమునకే నని తలంచి,  హరి పది అవతారములనెత్తుటకు కృత నిశ్చయుడాయెను. 

అపుడు హరి శివుని ఇలా కోరెను.  మహాదేవా! నేను పది మార్లు అవతార మెత్తినపుడు, నాకు నిగ్రహానుగ్రహ శక్తులను మీరే ప్రసాధించాలి అని కోరగా, అట్లే యనెను హరుడు. 

ఇదే దశావతారములకు నాంది.

మత్స్యావతారం, గర్వ భంగం:-- ఒకమారు సోమ శేఖరుడను వరప్రసాదిత గర్వ ఆసురుడు, బ్రహ్మ వద్దనున్న నాలుగు వేదాలు సంగ్రహించి, సముద్ర గర్భము దాగెను. సృష్టి కార్యం స్తంభించింది. అంత హరి మత్స్యావతారం ధరించి ఆ రక్కుసుని వధియించి వేదములను బ్రహ్మకిచ్చి సృష్టి కార్యము కోన సాగింప చేసెను. 

కానీ భృగు శాపముచే సర్వం మరచి, గర్వముచే, తన బలముచే సముద్రమును అల్లకల్లోలం చేయసాగెను. సాగరమున నున్న  జీవులన్నింటిని భక్షింప సాగెను. దేవతలు, ఋషులు భయబ్రాoతు లతో శివుని శరణు చొచ్చగా, ఇందులకు మహశాస్తా మాత్రమే మత్స్యము యొక్క గర్వమును అణుచునని తలంచి, శాస్తాను వేడగా శాస్తా బయలుదేరెను.

అప్పుడు శాస్తా మహాయోగి వలే ప్రకాశిస్తూ తేజో వంతుడైన జాలరి వేషము ధరియించి, మత్స్యమును పట్ట వెళ్లెను. అతి లాఘవమున మత్స్యమును అణగ ద్రొక్కేను. పిమ్మట మిక్కిలి ప్రకాశం వంతముగా పద్మరాగ మణులలాగు  మెఱియు ఆ చేప కన్నులు తన గోళ్ళతో ఊడబెరికి వేసెను. స్వామి స్పర్శచే హరికి తన అవతార అవశ్యము గుర్తునకొచ్చి నిజ రూపమును దాల్చెను. మత్స్య సంహార మహా శాస్తా  మూర్తిని ఋషులు, దేవతల కొనియాడారు. ఆ మణులను (కన్నులు) మహేశ్వరుడికి శాస్థా కానుకగా సమర్పింప, హారుడా మణులను తన కాపాలమాలయందు పొదిగించుకొనెను. మత్సావతార మూర్తి శాంతించి, వైకుంఠ నాథునిలో లీనమయ్యెను. 

శ్రీమహాశాస్తా వే శరణం     
శరణం శరణం ప్రబద్దే!

L. రాజేశ్వర్ 
 
 
 
 

Quote of the day

No one saves us but ourselves. No one can and no one may. We ourselves must walk the path.…

__________Gautam Buddha