Online Puja Services

స్వామి యొక్క 18 అవతారములు:

18.217.65.73
స్వామి వారు 18 అవతారములు కాదు ఇoకను ఎన్నియో రూపములలో “యద్భా వమ్ తథ్భవతే” అను సూక్తి ని అనుసరిoచి, తమ వివిధ రూపములచే దర్శనం ఒసంగి వున్నారు. అందున కొన్ని అనగా 18 ప్రాముఖ్యముగా చెప్పు కొను చున్నారు. 18 సంఖ్య యొక్క ప్రాముఖ్యత వలనను, స్వామికి “ పదినెట్టాoబడి అండవన్” అను బిరుదo వలనను, 18 కొండల వలనను ఈ 18 అవతారముల గా ఉదహరించి వుండవచ్చును. 18 సంఖ్య మన వేద వేదాలలోనూ, పురాణములలోనూ, ముఖ్యముగా భగవద్గీత, భారతం వల్లను మిక్కిలి ప్రాచర్యములోనికి వచ్చినది.
 
స్వామి 18 అవతారములు : (శ్రీ) 1. బాలశాస్తా. 2.ధర్మశాస్తా 3.లక్ష్మి శాస్తా 4.ఆశ్వారూఢ శాస్తా 5.భూతాదిప (ప్రత్యక్ష) శాస్తా 6.హరిహరాత్మజ (అయ్యనార్)శాస్తా 7.కాలశాస్తా 8.గజారూఢ శాస్తా 9.కరుణాకర శాస్తా 10.శత్రు విమర్ధన శాస్తా 11.జ్ణాణ శాస్తా 12.కిరాత శాస్తా 13.మహాశాస్తా 14.సమ్మోహన శాస్తా 15.విద్యా శాస్తా 16. సింహారూఢ శాస్తా 17.ప్రభా సత్యక సమెత శాస్తా 18.శ్రీ పూర్ణ పుష్కళా కళ్యాణ శాస్తా.

ఇదే విధముగా కొందరు 18 అవతారములు అని కొన్ని పేర్లు వేరు వేరు గా కలిపి 18 అవతారముల క్రింద చెప్పు చున్నారు. దాని ప్రకారం, అవి కూడా స్వామి అవతారములే కాన, స్వామికి 18 కన్నా అధికముగా అవతారములు వున్నవని చెప్పు కోవచ్చును. ఇందు కొందరు 1,శ్రీ వీర శాస్తా 2.శ్రీ శిల్పా శాస్తా 3.ఘోషస్పతి శాస్తా 4.అయ్యనారప్ప శాస్తా 5.అపూర్వ శాస్తా6. వృషభా రూడ శాస్తా .... ... ఇలా ఇంకొన్ని చెప్పి వున్నారు. ఏ పేరును “కాదు” అని చెప్పు అధికారము ఎవరికిని లేదు. ఎలన మన పూర్వీకులు ప్రతి ముఖ్యమైన విషయమును ఒక్కో చోట ఒక్కొక్క విధముగా చెప్పి వున్నారు. ఉదాహరణకు దేవతల పరిచయం, భూలోక అవతరణ, వినాయకును జన్మ వృత్తాంతం,శణ్మఖుని జననం, శ్రీ ధర్మశాస్తా వుద్భవం.....ఇలా యెన్నో యెన్నెన్నో. నిర్ధిష్టముగా ఇదే సరి అయినది అని చెప్పుకోలేక పోతున్నాము. వివరముల కన్నను మనకు మూలం ముఖ్యం.

ఇచట ముఖ్యముగా తెలుసుకొన వలసిన విషయం. కొందరు పంచ అయ్యప్పలు ఉన్నారని అంటూ వుంటారు. అది అజ్నాణముతో తెలియక చెప్పు మాటలు. అయిదు రకాలుగా శాస్థా వారు శబరిమల, మరుయు చుట్టూ ప్రక్కల వెలసి వున్నందున కొందరు అలా అంటున్నారు. అయ్యప్ప ఒక్కడే. అదే శబరిగిరి శాస్తా దివ్య సన్నిధి. ఇచట శాస్తా యోగీశ్వరునిగాను, కుళత్త పులై లో బాలుడిగాను, ఆర్యంగావు లో కళ్యాణ మూర్తిగాను, అచ్చన్ కోవిల్ నందు గృహస్తుని గాను, ఎరిమేలి యందు కిరాత రూపమున కాన వచ్చుట వలన పొరపాటు పడుతున్నారు.

- L.రాజేశ్వర్

Quote of the day

The life ahead can only be glorious if you learn to live in total harmony with the Lord.…

__________Sai Baba