Online Puja Services

పుట్టలో పాలు పోయడం ఎందుకు ?

3.148.229.54
నాగపంచమికి , నాగులచవితి పుట్టలో పాలు పోయడం ఎందుకు ?
 
ముందుగా ఈ మధ్యకాలం లో నాగపంచమి రాగానే చాలా మంది హిందువులు పాలను వృధా చేస్తున్నారు , ఆ పాలు పేదవారికి పోస్తే కడుపు నిండుద్ది , హిందువులు మూర్కులు అనే విదంగా పోస్ట్ లు పెడుతున్నారు . అసలు మన ఆచారం వెనుక వున్న శాస్త్రీయత తెలుసుకోకుండానే ఈ విధమైన విమర్శలు చేస్తున్నారు. 

శ్రవణం లో "నాగపంచమి" ( గరుడపంచమి ) కార్తీకం లో "నాగులచవితి" సంవత్సరం లో రెండు సార్లు పుట్టలో పాలు పోయడం , నాగపూజ చేయడం అనాదిగా వస్తున్నా ఆచారం . 
అసలు పాలు పుట్టలో పోయాల లేక పాముకు పోయాల అనేది సంశయం చాల మంది పాముకు పోయడం లేదా కొందరైతే పాములవాళ్లను పిలిచి పాము కు పూజ చేయడం చేస్తున్నారు . 
నిజానికి మన ఆచారం తెలిసి తెలియకుండా అనేక రూపాలుగా మార్పు చెంది అసలు విధి విధానం పోయి కొత్త కొత్త సంప్రదాయాలు వచ్చి చేరుతున్నాయి . 

దీనికి కారణం శాస్త్రీయ విషయ అవగాహన లేకపోవడమే . 

పుట్టలను చెదపురుగులు నిర్మిస్తాయి అవి వాటి నోటినుండి వెలువడే సుక్రోజ్ అనే జిగట పదార్థం ద్వారా మట్టిని తడిపి పుట్టగోడలను తయారు చేస్తాయి ఆలా చేసిన పుట్ట లు కొంతకాలానికి గట్టిపడి వాటిలో పాములు చేరి చెదపురుగుల్ని తింటాయి .అందుకే పుట్టలు పాముల నివాసస్థానాలుగా మనం బావించి పూజిస్తాము . 

మనం పుట్టలో పాలు పోసినప్పుడు ఆ పుట్టమన్ను తడిసి మట్టి వాసన వస్తుంది . ఆ మట్టి లోనుండి వచ్చే సుగంధం చెదపురుగుల చేత తడిసి ఎండిన సుక్రోజ్ గాల్లో కలిసి వాసన రూపం లో పుట్టలోనుండి బయటకు వస్తుంది . ఆ గాలి పీలిస్తే మనుషుల్లో సంతాన సంబంధ దోషాలు నశిస్తాయి . ఇది శాస్త్రీయంగా నిరూపించబడింది . 

పూర్వకాలం నుండి మనం చూస్తున్నాము, సంతానం కలుగని వారు చాలామంది పుట్ట పూజ చేసి సంతానం పొందారు . మన ఇండ్లల్లో వుండే దేవతల పూజలకు , గ్రామ దేవతల పూజల్లో కూడా పుట్ట మన్ను ( పుట్ట బంగారం ) తెచ్చి గద్దెలు వేసి ప్రతిష్టిస్తారు . ఆలా ఇంటి దేవతలను పూజించి సంతానం పొందినవారు కూడా చాలామందిని మనం చూసాము . 

అసలు విశేషమంతా పుట్టమట్టిలో వుంది . అందుకే మనవాళ్ళు ఎలాంటి దోషాలు ఎవరికీ వున్నది తెలియదు కాబట్టి సంవత్సరానికి ఒకసారి పుట్ట పూజ చేయడం వల్ల మనలోని దోషాలు మనకు తెలియకుండానే నశిస్తాయి . 

పూజ ఎలాంటి పుట్టకు చేయాలి ? 
* కొత్తపుట్టను పూజించాలి . 
* వీలైతే పొలాల దగ్గర , అడవిలో పుట్టలు ఉత్తమం . 
* అందరు పూజించే పుట్టల్లో ఫలితం తక్కువగా ఉంటుంది .
*. పుట్టలో గుడ్లు వేయకూడదు .
* ఇంట్లో వాళ్ళనందరు పుట్ట దగ్గర పూజలో పాల్గొని ఆ గాలి పీల్చడం ఉత్తమం . 

Quote of the day

As a single withered tree, if set aflame, causes a whole forest to burn, so does a rascal son destroy a whole family.…

__________Chanakya