Online Puja Services

గజారూఢ శాస్థ

18.191.29.0
హరి హర పుత్రుడు ధర్మశాస్తా కథలు. సీరియల్.నం.10*
 
 
ఈ దినం మనము "శ్రీ సమ్మోహన శాస్త" గురించి.
 
 తేజోమoడల మధ్యకం త్రినయనం దివ్యాంబరా లంకృతం 
 దేవం పుష్ప సరేక్షుకార్ముఖ లసత్ మాణిక్య పాత్రావయాన్ 
 భిబ్రాణం కరపంకజై: మదగజ స్కంధాది రూడo 
 మహా శాస్తారం సతతం నమామి వరదo త్రైలోక్య సమ్మోహనం! 

తేజోమoడల మధ్యముడు, మూడు కన్నులవాడు, అందమైన వస్త్రములను ధరించిన వాడు, పుష్పమాలిక, చెరకు విల్లును, మాణిక్య పాత్రను , అభయ ముద్రను చేతులయందు ధరించిన వాడు, మధగజమును అధిరోహించిన వాడు, కోరిన కోర్కెలు నెరవేర్చు నట్టి శాస్థాను నా మనస్సు నందు ధ్యానించు చున్నాను.  

గజారూఢ శాస్థ 
 
తన ప్రియ పుత్రుడికి ఒక వాహనము తయారు చేయమని శివుడు నందిని ఆజ్ఞాపించెను. నందీశ్వరుడు సాక్షాత్తు నాలుగు వేదములు రూపు దాల్చిన శ్వేత గజము గాక, మరియొక నలుపు రంగు దాల్చిన గజమునిచ్చెను. స్వామికి ఆ గజము వాహనమైనది.

దేవతలు, త్రిమూర్తులు స్తుతించు స్వామి అధిరోహించుటచే ఆ గజము అందరికి వందనీయమైనది. అప్పుడు సాహసం అను ద్వీపమున ప్రభాకరుడు అను రాజు ఉండెను. అతడికి నలుగురు కుమారులు. వారు పార్వతి దేవిని, స్కందుని, శాస్తాను ఆరాధించే భక్తులు. వారు వీరి గురించి తపస్సు చేయు చుండగా బ్రహ్మ, విష్ణు వాహనము లైన హంస, గరుడుడు వారి తపము భగ్నము చేయగా, వారు శాప వశమున భూతములై స్వామి నివసించు ఆవరణకు దగ్గరలోనే సంచరించు చుండిరి. వారిలో "తారకుడు" అను వాడు శా స్థా కు మిక్కిలి కడు భక్తుడు.

ఒకపరి ఆసురులకు, అమరుల కు  ఘోరమైన యుద్ధము జరిగి నపుడు, అమరుల వీరి సహాయము కోరగా వీరు శివాజ్ఞ లేకనే దేవతల పక్షాన నిలిచి పోరాడి, దేవతలకు విజయం సాధించి పెట్టారు.  ఆసురేంద్రుడు శివుడి వద్దకు వెళ్లి  ఈ భూతములు తమ కులనాశనము చేసినవి అని చెప్పినాడు.  కోపించి శివుడు, తన ఆజ్ఞ లేకనే ఈ పని చేసినందులకు గాను వీరిని  అమరల చెంత చేరుదురుగాక అని శపించెను. 

దీనికి అంతటకు కారణము హంసయు, గరుడుడు అని కోపించి, పగ తీర్చుకోనుటకై నిశ్చయించుకున్నారు ఆ నలుగురు. ఒకనాడు శాస్తాను, కుమారస్వామియు, శివ తాండవము చూచు చుండగా, ఈ నలుగురు వెళ్లి వారి వాహనముల ద్వారా హంస, గరుడుని  వధింప చేశారు. విషయము తెలిసిన సుబ్రహ్మణ్యుడు, కోపించి వారికి శాపము ఒసంగినాడు. ఆసురులుగా జన్మించి, తిరిగి వారిరువురి చే వధింపబడి, అసురులకు సహాయము చేసినoదున ఉన్నతి పదవి కూడా పొందుదురని  వరము నిచ్చినాడు.

శాస్థా భక్తుడు తారకుడు స్వామిని ప్రార్థింప, స్కందుని చే సంహరింపబడి తన వాహనము అగునట్లు అనుగ్రహించెను. అప్పటికే,  హంస, గరుడినికి,  అపకారం చేసినందులకు గాను, అన్నదమ్ములిరువురు వారి వాహనములకును అనగా స్వామి గజమును, స్కందుని నెమలి, కోడి పుంజు, శక్తి  మాత సింహము ను తమ వాహన పదవులు కోల్పోయి వున్నవి.   అవి ఈ శ్వరుని ప్రార్థించి,  నందీశ్వరుని యొక్క సారూప్య ముక్తిని పొందినవి.

పిదప ఆ నలుగురు, కాశ్యప ముని, మాయ దంపతులకు పుత్రులుగా జన్మించిరి. శూరుడు, పద్ము డు.. సూరపద్ము లుగాను, సింహము ..సింహము సింహ ముఖాసురుడిగాను, జన్మించిరి. తారకుడు స్వామికి వాహనంగా మారుటకై తారకా సురుడిగాను జన్మించెను.  షన్ముఖుడివేలాయుధం సంహరింపబడి, మునుపు పొందిన వరము కారణముగా గజాకృతిని పొంది మహాశాస్తా ని శరణు పొంది, ఆయనకు వాహన మాయెను. స్వామి మధగజవాహనుడు ఆయెను.  

శ్రీధర్మశాస్తా వే శరణం     
శరణం శరణం ప్రబద్దే!

ఎల్.రాజేశ్వర్

Quote of the day

The life ahead can only be glorious if you learn to live in total harmony with the Lord.…

__________Sai Baba