సర్వోత్తమ సూక్ష్మధ్యానము
సర్వోత్తమ సూక్ష్మధ్యానము ద్వారా, శ్రీ కనకదుర్గా మాత యొక్క సాక్షాత్కారం ...!! శంకరులు, "సౌందర్యలహరి" లోని 21వ శ్లోకాన్ని, ఈ విషయాన్నే తెలియచేస్తూ, ఇలా రచించారు,
తటిల్లేఖాతన్వీం - తపనశశివైశ్వానరమయీం
నిషణ్ణాం షణ్ణా - మప్యుపరి కమలానాం తవ కలామ్
మహాపద్మాటవ్యాం - మృదితమలమాయేన మనసా
మహాంతః పశ్యంతో - దధతి పరమాహ్లాదలహరీమ్
శంకరులు తన శబ్దకోశములోనుంచి ప్రయోగించే ప్రతి శబ్దములో (మాటలో) ఎంతో లోతైన శాస్త్ర విషయములు దొర్లుతాయి. ఈ శ్లోకములో శంకరులు వివరించినట్లు కనుక ధ్యానము చేయగలిగితే, శ్రీ కనకదుర్గా మాత యొక్క సాక్షాత్కార దర్శన ప్రాప్తి నిశ్చయమే. అటువంటి సూక్ష్మ ధ్యాన సిద్ధి కలగకుండానే, అమ్మవారిని మేము దర్శించాము అని చెప్పే వారి మాటలు సత్యము కాదు.అలా సాధ్యమూ కాదు. సహస్రార పద్మములోని చంద్రమండలపు స్ధిరమైన అమ్మవారి యొక్క రూపమునే, 16వ కళ అంటారు.
ఆ రూపమునే, "సాదా" అనీ, "సమయా" అనీ, "ధ్రువా" అనీ, అంటారు. ఆ రూపమే, శ్రీ కనకదుర్గా అమ్మవారు. ఆ రూపము మెరుపు తీగవలె సూక్ష్మమై, దీర్ఘమై, క్షణ ప్రకాశ వికాస లక్షణము కలదై,సూర్యచంద్రాగ్ని రూపసమన్వితమై, షట్చక్రములపైగల మహాపద్మాటవిలో స్థిరమైన సాదాఖ్యకళ.
అటువంటి శ్రీ కనకదుర్గా మాత కబుర్లకు దొరకదు.
"భక్తిప్రియా" కనుక భక్తికి దొరుకుతుంది. కనుక భక్తితో కూడిన సాధన కొనసాగించెదముగాక.
శ్రీ శంకర భగవత్పాద విరచిత
సౌందర్య లహరి.
సౌందర్యలహరి మరియు శ్రీ లలితాసహస్రనామ సమన్వయ సాధనా మరియు శోధనా కొనసాగుతుంది.
శ్రీ కనకదుర్గా, దేవతా, పరదేవతా, నమోస్తుతే
-
శివకుమార్ రాయసం